తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికుల (Handloom workers) సంక్షేమాన్ని తన ప్రధాన ఆజెండాగా తీసుకుని, వరుసగా పలు పథకాలతో వారి జీవితాల్లో వెలుగులు నింపే దిశగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ నిధులను వేగంగా పంపిణీ చేయాలన్న ఉద్దేశంతో వ్యవసాయ, చేనేత & జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Thummala Nageswara Rao) జూలై 10న హైదరాబాద్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో కీలక ఆదేశాలు జారీ చేశారు.

మంత్రి మాట్లాడుతూ
ఈ సందర్భంగా మంత్రి తుమ్మల (Thummala Nageswara Rao) మాట్లాడుతూ, ప్రభుత్వ శాఖలకు అవసరమైన వస్త్రాల కోసం సెప్టెంబర్ నెలలోపే ఆర్డర్లు తీసుకోవాలని సూచించారు. ఇప్పటికే అందిన ఆర్డర్లకు సంబంధించిన వస్త్రాలను వేగంగా పంపిణీ చేయాలని స్పష్టం చేశారు. అంతేకాకుండా, హైదరాబాద్‌లో ఉన్న కొండా లక్ష్మణ్ బాపూజీ ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని ఏడాదిలోగా యాదాద్రి జిల్లా పోచంపల్లికి శాశ్వతంగా తరలించాలని ఆదేశించారు.
టెస్కో షోరూంల పనితీరులో మార్పులు
మహిళా కార్మికులకు నూతన అవకాశాలను కల్పిస్తూ, ‘మహిళా శక్తి’ చీరల ఉత్పత్తి (Saree production) ని మరింత వేగవంతం చేయాలని, అలాగే టెస్కో షోరూంల నిర్వహణను మెరుగుపరచాలని మంత్రి సూచించారు.
‘నేతన్నకు చేయూత’ పథకం ద్వారా మృతుల కుటుంబాలకు సహాయం
‘నేతన్నకు చేయూత’ పథకం కింద 194 మంది మృతుల కుటుంబాలకు రూ. 9.70 కోట్లు అందించినట్లు ఆమె పేర్కొన్నారు. ఈ పథకం ద్వారా వారి కుటుంబాలు ఆర్థికంగా కొంత స్థిరతను పొందనున్నాయి.
రుణమాఫీ నిధుల జమపై స్పష్టమైన ఆదేశాలు
ఈ సమీక్షలో భాగంగా జౌళి శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్ మాట్లాడుతూ, చేనేత కార్మికుల రుణమాఫీ కోసం ప్రభుత్వం రూ. 33 కోట్లు విడుదల చేసిందని తెలిపారు. ఈ పథకం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా 5,691 మంది కార్మికులు లబ్ధి పొందనున్నారని, వెరిఫికేషన్ పూర్తి కాగానే నిధులు విడుదల చేస్తామని వివరించారు.
జాతీయ పురస్కార గ్రహీతల సత్కారం
అనంతరం, 2024 సంవత్సరానికి గాను జాతీయ చేనేత పురస్కారాలకు ఎంపికైన పుట్టపాక గ్రామానికి చెందిన గజం నర్మద, గూడ పవన్‌లను మంత్రి తుమ్మల శాలువాతో సత్కరించారు. తెలంగాణ చేనేతకు జాతీయ స్థాయిలో గుర్తింపు తేవడం గర్వకారణమని, కార్మికుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన భరోసా ఇచ్చారు.
తెలంగాణ చేనేత శాఖ మంత్రి ఎవరు?
వ్యవసాయ, చేనేత, జౌళి శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
తెలంగాణలో ప్రసిద్ధ చేనేత గ్రామం ఏది?
తెలంగాణలోని పోచంపల్లి అనే గ్రామం పరిమాణంలో చిన్నదే కావచ్చు, కానీ చేనేత రంగంలో తనకంటూ ఒక పెద్ద పేరు తెచ్చుకుంది.
Read hindi news: hindi.vaartha.com
Read also: KCR: వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో అడ్మిట్ అయిన కేసీఆర్