Sammakka Saralamma: మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు పోటెత్తిన భక్తుల రద్దీని ఆసరాగా చేసుకుని కేటుగాళ్లు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నారు. మొబైల్ ఫోన్లు, బంగారు ఆభరణాలు, నగదు దొంగిలిస్తూ భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నారు.
Read Also:Medaram : వనం వీడిన సమ్మక్క .. కాల్పులతో ఘన స్వాగతం

రెడ్ హ్యాండెడ్‌గా దొరికిన దొంగ
మేడారం గద్దెల సమీపంలోని రెండో గేటు వద్ద ఓ వృద్ధుడు భక్తుడి మొబైల్ ఫోన్‌ను దొంగిలిస్తుండగా బాధితుడు అప్రమత్తమై అతడిని పట్టుకున్నాడు. వెంటనే నిందితుడిని పోలీసులకు అప్పగించగా, అతని వద్ద నుండి రెండు స్మార్ట్‌ఫోన్లు మరియు ఛార్జర్‌ను స్వాధీనం చేసుకున్నారు. జంపన్న వాగు(Jampanna Vagu) వద్ద పుణ్యస్నానాలు ఆచరించే సమయంలో తమ నుంచి రూ.10 వేల నగదుతో పాటు బంగారు గొలుసును దొంగలు ఎత్తుకెళ్లారని ఇద్దరు అన్నదమ్ములు పోలీసులను ఆశ్రయించారు. ఇలా జాతరలోని వివిధ ప్రాంతాల్లో చిన్నపాటి అజాగ్రత్తగా ఉన్నా దొంగలు నిమిషాల్లో అన్నీ ఊడ్చేస్తున్నారు.
పోలీసుల హెచ్చరిక
జాతరలో దొంగల ముఠాలు సంచరిస్తున్నాయని, భక్తులు తమ విలువైన వస్తువుల పట్ల అత్యంత జాగ్రత్తగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు. ముఖ్యంగా గద్దెల వద్ద, వాగు వద్ద స్నానాలు చేసే సమయంలో గుంపులుగా వచ్చే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఏవైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని వెల్లడించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: