తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో అమలు చేస్తున్న ఫేషియల్ రికగ్నేషన్ అటెండెన్స్ (FRS) మంచి ఫలితాలను ఇస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా ఎస్ఆర్ఎస్ను అమలు చేయడం ప్రారంభించినప్పటి నుంచి ఇటు విద్యార్థుల హాజరుతోపాటు ఉపాధ్యాయుల హాజరు కూడా గణనీయంగా పెరుగుతున్నట్టు హాజరు శాతంను చూస్తే తెలుస్తోంది. గతంలో ఎఫ్తార్ఎస్ ను అమలు చేయనప్పుడు విద్యార్థుల్లో 60 శాతం కంటే తక్కువగా హాజరు ఉండేది. ఇక ఉపాధ్యాయుల్లో అయితే 70 శాతానికి మించి ఉండేది కాదు. కానీ ఎప్పుడైతే ఎస్ఆర్ఎస్ అమలు చేయడం ప్రారంభిం చారో.. అప్పటి నుంచి విద్యార్థుల హాజరు శాతం పెరగడంతోపాటు ఉపా ధ్యాయుల హాజరు కూడా గణనీయంగా పెరిగింది.
Read also : Tirumala: ఫిబ్రవరి నెల టిక్కెట్లు రేపు ఆన్లైన్లో విడుదల

స్థానిక సంస్థల పాఠశాలలతోపాటు
రాష్ట్రంలో ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలతోపాటు మోడల్ స్కూల్స్, కేజిబివిలు, రెసిడెన్షి యల్ స్కూల్స్ కలిపి 24,994 ఉన్నాయి. వాటిల్లో 19,38,270 మంది విద్యార్థులు ఉన్నారు. వారిలో ప్రతిరోజూ సుమారు 70 శాతం పాఠశాల లకు హాజరవుతున్నారు. యుడైస్లో ఉన్నవారిలో కొన్ని ఆధార్ కార్డుల్లో ఇబ్బందులు ఉన్నవారు సుమారు 2500 మంది వరకు ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వారు కాకుండా మిగిలిన విద్యార్థుల్లో సుమారు 70 శాతం నుంచి 75 శాతం వరకు పాఠశాలలకు హాజరవుతున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎస్ఆర్ఎస్ అమలు చేయకముందు విద్యార్థుల హాజరు 60 శాతం వరకు ఉండేదని.. అప్పుడప్పుడు 65 శాతం వరకు వచ్చేదని అధికారులు చెబుతుండగా.. ఎస్ఆర్ఎస్ అమలు చేయ డం ప్రారంభించిన తరువాత హాజరు శాతం 70 నుంచి 75 శాతం వరకు వస్తుందన్నారు.

ఎస్ఆర్ఎస్అమలు చేయకముందు
ఇక రాష్ట్రంలోని 24,994 పాఠశాలల్లో 1,31,693 మంది ఉపాధ్యాయులు ఉన్నారు. వారిలో 83 నుంచి 85 శాతం వరకు ఉపాధ్యాయులు పాఠశాలలకు హాజరవుతున్నారు. (FRS)ఎస్ఆర్ఎస్అమలు చేయకముందు ఉపాధ్యాయుల హాజరు 70 శాతం దాటేది కాదని అధికారులు అంటున్నారు. కానీ ఎస్ఆర్ఎస్ అమలు చేసిన తరువాత నుంచి టీచర్ల హాజరు పెరుగుతోంది. ప్రస్తుతం 80 నుంచి 85 శాతం వరకు ఉపాధ్యాయుల హాజరు ఉంటుంది. ఎస్ఆర్ఎస్ అమలు తరువాత సుమారు 20 శాతానికి పైగా ఉపాధ్యాయుల హాజరుశాతం పెరిగినట్టు అధికారులు గుర్తించారు.
ఉపాధ్యాయుల హాజరు శాతం గతం కంటే పెరిగినప్పటికీ.. ఉపాధ్యాయుల్లో రోజువారీ సెలవుల్లో ఉన్నవారు, లాంగ్ లీవ్స్ తీసుకున్న వారు, ఫారెన్హీవ్స్ ఉన్న వారు సుమారు 10 శాతం ఉన్నట్టు అధికారులు చెబుతున్నారు. వారు కాకుండా సుమారు 7 నుంచి 10 శాతం మంది ఉపాధ్యాయుల వివరాలు పాఠశాల విద్య శాఖకు అందడం లేదు. వారు ఇటు రోజువారీ సెలవుల్లోనూ లేక, లాంగ్లోవ్స్లోనూ లేకుండా, ఫారిన్ లీవ్స్లోనూ లేకుండా ఉన్నారు. అటువంటి వారి వివరాలను సేకరించి పంపించాలని పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులు విద్యాశాఖాధికారులను కోరినట్టు తెలిసింది. ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఎర్ఎస్ అమలు చేసి.. సత్ఫలితాలు ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని గురుకులాల్లోనూ ఇదే ఎస్ఆర్ఎస్ హాజరు విధానాన్ని అమలు చేయాలనే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. వచ్చే ఏడాది 2026-27 నుంచి గురుకులాల్లో కూడా ఎస్ఆర్ఎస్ను అమలు చేయాలని రాష్ట్ర సర్కార్ భావిస్తున్నట్టు తెలుస్తోంది.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :