हिन्दी | Epaper

Telugu News: Uttam-రూ. 35 వేల కోట్ల అంచనా వ్యయం శుద్ధ అబద్ధం

Pooja
Telugu News: Uttam-రూ. 35 వేల కోట్ల అంచనా వ్యయం శుద్ధ అబద్ధం

హైదరాబాద్‌లోని డా. బి.ఆర్. అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం నుండి శుక్రవారం ప్రకటన విడుదల చేసిన నీటిపారుదలశాఖ మంత్రి నల్లమడ ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మిడిహట్టిపై జరుగుతున్న ప్రచారాన్ని తీవ్రంగా ఖండించారు. తుమ్మిడిహట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణానికి ఇప్పటి వరకు ఎటువంటి అంచనాలు రూపొందించలేదని ఆయన స్పష్టం చేశారు.

బిఆర్యస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావు రూ. 35 వేల కోట్ల నిర్మాణ వ్యయం, 4.47 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందిస్తుందని చెబుతూ చేస్తున్న ప్రకటనలు పూర్తిగా అసత్యమని ఉత్తమ్ విమర్శించారు. ప్రభుత్వం ఇప్పటివరకు బ్యారేజ్ నిర్మాణానికి సంబంధించిన అంచనాల ప్రక్రియనే ప్రారంభించలేదని, ఇలాంటి పరిస్థితుల్లో హరీష్ రావు ఎలా నిర్దారణకు వచ్చారని ప్రశ్నించారు.

 Uttam

హరీష్ రావుపై మంత్రి ఉత్తమ్ విమర్శలు

ఇలాంటి సత్యదూరమైన ప్రకటనలు హరీష్ రావు (Harish Rao)అతి తెలివి తేటలను మాత్రమే ప్రతిబింబిస్తున్నాయని మంత్రి ఉత్తమ్ అన్నారు. ప్రజలు ఇటువంటి నిరాధారపూరితమైన మాటల పట్ల అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. తుమ్మిడిహట్టి బ్యారేజ్, చేవెళ్ల ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన అంచనాలు రూపొందించిన పక్షంలో రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా ప్రకటిస్తుందని ఆయన స్పష్టం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వం పారదర్శకంగా పని చేస్తోందని, రైతు సంక్షేమానికి కట్టుబడి ఉందని ఉత్తమ్ తెలిపారు. పెండింగ్ ప్రాజెక్టుల నిర్మాణాలను వేగవంతం చేస్తూ రైతాంగానికి సాగునీరు అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు.

తుమ్మిడిహట్టి ప్రాజెక్టు ఖర్చుపై హరీష్ రావు ఏమని చెప్పారు?
రూ. 35 వేల కోట్ల వ్యయం, 4.47 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీరు అందిస్తుందని అన్నారు.

మంత్రి ఉత్తమ్ దీనిపై ఏమన్నారు?
ఆ ప్రకటనలు పూర్తిగా అసత్యమని, ఇప్పటివరకు ఎటువంటి అంచనాలు రూపొందించలేదని చెప్పారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also:

https://vaartha.com/ap-schools-dussehra-holidays-from-22nd-of-this-month/andhra-pradesh/550756/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

యుద్ధోన్మాది అమెరికా ప్రపంచ ప్రజల శత్రువు!

మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

మున్సిపల్ కార్యాలయంలో వివాదం…!

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

హైటెక్ అడుగులతో వ్యవసాయానికి స్వర్ణ యుగం

చట్టం అందరికీ సమానమేనా?

చట్టం అందరికీ సమానమేనా?

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

దానం, కడియంలకు భారీ ఊరట.. అనర్హత వేటు నుంచి క్లీన్ చిట్!

పతనం అంచున ప్రజారోగ్యం

పతనం అంచున ప్రజారోగ్యం

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

ఆ రాష్టాలతో పోల్చుకుంటే తెలంగాణ రైతులకే అప్పులు తక్కువ

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

టీ – సేవ ఆన్లైన్ స్కిల్ కేంద్రాల ఏర్పాటుకు దరఖాస్తుల ఆహ్వానం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

పుల్కల్ మండలం సింగూరు ప్రాజెక్టును సందర్శించిన NDSA బృందం

📢 For Advertisement Booking: 98481 12870