తెలంగాణ గ్రూప్ 2 ఉద్యోగాలకు నియామక పత్రాలు పంపిణీ
తెలంగాణ రాష్ట్రంలోని గ్రూప్ 2 ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు శనివారం (అక్టోబర్ 18) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Chief Minister Revanth Reddy) చేతుల మీదుగా నియామక పత్రాలు (TGPSC) అందించనున్నారు. ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని శిల్పకళా వేదికలో సాయంత్రం 5 గంటలకు ప్రారంభం కానుంది. మొత్తం 783 మందికి నియామక పత్రాలు అందించనున్నారు.
ఎంపికైన అభ్యర్థుల డాక్యుమెంట్ల వరిఫికేషన్ ఇప్పటికే పూర్తయ్యింది. శాఖల వారీగా ఉద్యోగుల నియామకానికి అవసరమైన ఏర్పాట్లు అధికారుల అధ్వర్యంలో పూర్తయ్యాయి. నియామక పత్రాల పంపిణీ అనంతరం అభ్యర్థులు తాము ఎంపికైన పోస్టుల్లో సేవలు ప్రారంభించనున్నారు.
Read also: బోటు బోల్తా పడి ముగ్గురు భారతీయులు మృతి..పలువురు గల్లంతు

ఉద్యోగుల కుటుంబ సభ్యులకు ప్రత్యేక ఏర్పాట్లు
ఈ వేడుకలో ఉపముఖ్యమంత్రి (TGPSC) భట్టి విక్రమార్క, శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌తో పాటు పలువురు మంత్రులు పాల్గొననున్నారు. ఎంపికైన అభ్యర్థుల కుటుంబ సభ్యులకు ఈ వేడుకలో పాల్గొనడానికి ప్రత్యేక ఏర్పాట్లు చేయడం విశేషం.
టీఎస్‌పీఎస్సీ ఇటీవల విడుదల చేసిన ఫలితాల్లో 783 పోస్టులకు గాను 782 పోస్టులకు ఎంపిక జాబితా విడుదల చేసింది. ఒక పోస్టు మాత్రం తాత్కాలికంగా నిలిపివేయబడినట్టు కమిషన్ వెల్లడించింది. ఈ నియామకాలు సాధారణ పరిపాలన, రెవెన్యూ, ఎక్సైజ్, పంచాయతీరాజ్, వాణిజ్య పన్నుల శాఖలకు సంబంధించినవిగా ఉన్నాయి.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also: