(TG Weather) రాష్ట్రంలో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. చలి తీవ్రత విపరీతంగా పెరగడంతో ప్రజలు గజగజ వణికిపోతున్నారు. దాదాపు అన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3 నుంచి 4 డిగ్రీల మేర తగ్గాయి. ముఖ్యంగా సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు దట్టమైన పొగమంచు కమ్ముకోవడంతో రహదారులపై దృశ్యత తగ్గి, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
Read Also: TG Holidays List: 2026 టీజీ హాలిడేస్ లిస్ట్ విడుదల
నిర్మల్ జిల్లా పెంబి మండలం చింతగూడకు చెందిన 60 ఏళ్ల వృద్ధుడు గంగారెడ్డి చలి తీవ్రతకు బలవ్వడం ఈ పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.హైదరాబాద్ నగరాన్ని సైతం చలి (TG Weather) వదలడం లేదు. నగర శివారు ప్రాంతమైన శేరిలింగంపల్లిలో ఆదివారం రాత్రి 8.4 డిగ్రీల రికార్డు స్థాయి కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. దీంతో నగరవాసులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం
హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. రానున్న రోజుల్లో చలి ప్రభావం మరింత ఎక్కువ అవుతుందని చెప్పారు. ముఖ్యంగా వచ్చే నాలుగు రోజులు (డిసెంబర్ 10, 11, 12, 13) చలి తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్రంలోనే అత్యల్ప కనిష్ఠ ఉష్ణోగ్రత సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో 7.2 డిగ్రీ సెల్సియస్‌గా నమోదైంది.
ఉత్తర తెలంగాణ జిల్లాల్లో చలి ప్రభావం అధికంగా ఉన్నప్పటికీ, దక్షిణ తెలంగాణలోని కొన్ని జిల్లాల్లోనూ చలిగాలుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈనెల 16 వరకు చలిగాలుల ప్రభావం తీవ్రంగా ఉంటుందని అంచనా వేశారు. ముఖ్యంగా జగిత్యాల, సంగారెడ్డి, ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, వికారాబాద్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సిద్ధిపేట, రంగారెడ్డి ఉన్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: