హైదరాబాద్ (Hyderabad) లో తెల్లవారుజాము నుంచే నగరంలోని అనేక ప్రాంతాల్లో కుండపోతగా వర్షం కురవడంతో రోడ్లు నీటమునిగాయి. కొన్ని చోట్ల డ్రైనేజీ వ్యవస్థ సరిగా పనిచేయకపోవడంతో ట్రాఫిక్ రద్దీ ఏర్పడింది. ముఖ్యంగా మాధాపూర్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, ఎర్రగడ్డ, అమీర్‌పేట్, చందానగర్, మల్కాజిగిరి వంటి ప్రాంతాల్లో రోడ్లు చెరువుల్లా మారాయి. ఆఫీసులకు, విద్యాసంస్థలకు వెళ్లే ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read Also: TG: మాన్యుఫ్యాక్చరింగ్ సెంటర్ ని ప్రారంభించిన మంత్రి శ్రీధర్ బాబు
ఇదిలా ఉండగా, రానున్న గంటల్లో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మరింత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో తెలంగాణకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది.
వాతావరణ శాఖ ప్రకారం, తూర్పు మధ్య అరేబియా సముద్రం ,దాని పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కొనసాగుతున్నాయని తెలిపింది.మొంథా తీరాన్ని తాకడంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని కచ్చితమైన అంచనాలకు పేరుగాంచిన ‘తెలంగాణ వెదర్‌మ్యాన్’ తెలిపారు.

భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో
ముఖ్యంగా ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, యాదాద్రి భువనగిరి, మహబూబాబాద్, సూర్యాపేట, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని ఆయన వివరించారు.
కొన్ని ప్రాంతాల్లో 80 నుంచి 180 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని అంచనా వేశారు.ఇక హైదరాబాద్ విషయానికొస్తే, బుధవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు అడపాదడపా ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని ఆయన పేర్కొన్నారు.
ఐఎండీ సైతం నగరంలో మోస్తరు వర్షాలతో పాటు బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1 వరకు ఉదయం పూట పొగమంచు లేదా మబ్బులతో కూడిన వాతావరణం ఉంటుందని వెల్లడించింది. భారీ వర్షాల హెచ్చరికల నేపథ్యంలో, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రయాణాలు చేసేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: