తెలంగాణలో గత కొద్దిరోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది.చలి, పొగమంచు తీవ్రత అధికంగా ఉంది. తెలంగాణలో దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్ నమోదవుతున్నాయి. రాష్ట్రంలో 2-3 రోజులు కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 3-4 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఆసిఫాబాద్, సంగారెడ్డి, మెదక్, మంచిర్యాల, కామారెడ్డి, వరంగల్, వికారాబాద్ జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
Read Also: AP Weather: ఏపీలో 3.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదు

దాదాపు అన్నిచోట్లా సింగిల్ డిజిట్ టెంపరేచర్స్
రాత్రి, ఉదయం వేళ అవసరం అయితేనే బయటకు రావాలని వాతావరణ అధికారులు చెబుతున్నారు.రాత్రి పడుకునే సమయంలో మందపాటి దుప్పట్లు వాడాలి. గదులను వేడి చేయడానికి హీటర్లు వాడుతున్నట్లయితే, గాలి ఆడేలా జాగ్రత్తలు తీసుకోవాలి, లేదంటే ఊపిరాడక ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. చలికాలంలో చర్మం పొడిబారకుండా మాయిశ్చరైజర్లు వాడాలి. ఏదైనా అనారోగ్య లక్షణాలు కనిపిస్తే స్వయం వైద్యం చేసుకోకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం ఉత్తమం. రాబోయే రెండు రోజులు మరింత అప్రమత్తంగా ఉండి చలి నుంచి కాపాడుకోవాలి.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: