హైదరాబాద్‌లో ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel messi) పర్యటన ఘన విజయం సాధించడంపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతోషం వ్యక్తం చేశారు. ఈ అంతర్జాతీయ స్థాయి ఈవెంట్ ద్వారా తెలంగాణ సత్తా ఏంటో ప్రపంచానికి స్పష్టంగా చూపించగలిగామని ఆయన అన్నారు. క్రీడలు, ఆతిథ్యం, నిర్వహణలో తెలంగాణ ప్రత్యేకతను మరోసారి నిరూపించిందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ, హైదరాబాద్‌కు విచ్చేసి క్రీడాభిమానులను ఉత్సాహపరిచిన లియోనెల్ మెస్సీ, లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్‌లకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
Read also: Second Phase Polling: ముగిసిన పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్
రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు
ఈ కార్యక్రమానికి హాజరై వేడుకను మరింత ప్రత్యేకంగా మార్చిన కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ మెగా ఈవెంట్ విజయవంతానికి అహర్నిశలు శ్రమించిన అధికారులు, భద్రతా సిబ్బంది, నిర్వాహకులు, సిబ్బందిని అభినందించారు. క్రమశిక్షణతో సహకరించిన క్రీడాభిమానులు, ప్రజలకు ప్రభుత్వం తరఫున కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమం తెలంగాణను గ్లోబల్ స్థాయిలో మరింత గుర్తింపు పొందేలా చేసిందని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: