తెలంగాణను వివిధ రంగాల్లో దేశంలో అగ్రస్థానంలో నిలబెట్టామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth reddy) ప్రకటించారు. వరి ఉత్పత్తిలో పెరుగుదల, చట్టవ్యవస్థ బలపడటం, గంజాయి నిర్మూలనలో రాష్ట్రం ముందంజలో ఉండటం తమ ప్రభుత్వ పనితీరుకు నిదర్శనమని చెప్పారు. త్వరలోనే విద్య, వైద్య రంగాల్లోనూ ఇదే విజయాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లా దేవరకొండలో జరిగిన ప్రజాపాలన విజయం సభలో పాల్గొన్న ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసి, అక్కడి ప్రజలకు కొత్త హామీలు ఇచ్చారు. దేవరకొండ అభివృద్ధికి ప్రత్యేక నిధులు, నర్సింగ్ కాలేజీ వంటి పథకాలను చేపడతామని తెలిపారు.
Read also: TG: గ్లోబల్ సమ్మిట్‌లో ప్రసంగించనున్న ప్రముఖుల జాబితా ఇదే!

We have positioned Telangana as number one
4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి
ఈ సభలో మాజీ సీఎం కేసీఆర్‌పై మండిపడ్డ రేవంత్, దశాబ్దం పాటు కేసీఆర్ కుటుంబం రాష్ట్రాన్ని అప్పుల బారిన పడేలా చేసిందని ఆరోపించారు. బీఆర్‌ఎస్‌లో కేటీఆర్‌నే ప్రధాన అడ్డంకిగా ప్రజలు భావిస్తున్నారని వ్యాఖ్యానించారు. డబుల్ బెడ్‌రూం ఇళ్లపై బీఆర్ఎస్‌కు సవాల్ విసిరిన ఆయన, కాంగ్రెస్ ప్రభుత్వం 4.50 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి భారీ నిధులు కేటాయించిందని అన్నారు. నల్లగొండ జిల్లాకు కీలకమైన ఎస్ఎల్‌బీసీ, డిండి ప్రాజెక్టులను ఎవరు అడ్డుకున్నా పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. రాబోయే పంచాయతీ ఎన్నికల్లో అభివృద్ధి కోసం పనిచేసే నాయకులను గెలిపించాలని ప్రజలను కోరారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: