Telangana government decision: యాసంగి సీజన్ యూరియా వంపిణీకి సంబంధించి తెలంగాణ(TG) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గత వానకాలం సాగు సమయంలో యూరియా కొరతతో రైతులు పడిన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని, సాగు విస్తీర్ణం ఆధారంగానే యూరియా పంపిణీ చేయనుంది. దీనికోసం 2 ప్రత్యేక యాప్ అభివృద్ధి చేసింది. బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు సాంకేతికతను వినియోగించనుంది. అలానే యాసంగి సీజన్కు సంబంధించి కేంద్రం నుంచి యూరియా సరఫరాను వేగవంతం చేయాలని కోరుతోంది.
Read Also: Telangana Heritage: జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాల ఆవిష్కరణకు రెడీ
సాగు విస్తీర్ణం ఆధారంగా మాత్రమే యూరియా అందజేత
వానాకాలం సాగు సమయంలో తెలంగాణ(TG)లో యూరియా కోసం రైతుల ఎన్ని ఇబ్బందులు వద్దారో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.. బస్తా యూరియా కోసం గంటల కొద్ది కిలోమీటర్ల మేర క్యూలైన్లలో నిల్చున్నారు. యూరియా కొరతపై ఇటు విపక్షాల నుంచే కాక ప్రజలు కూడా ప్రభుత్వం మీద తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో యాసంగి సీజన్కు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది, ఈసారి యూరియా కొరత లేకుండా, బ్లాక్ మార్కెట్ను అరికట్టేందుకు గాను తెలంగాణ వ్యవసాయ శాఖ కఠిన చర్యలు తీసుకోవడానికి రెడీ అవుతోంది.

దీనిలో భాగంగా ఈసారి నుండి సాగు విస్తీర్ణం ప్రకారమే యూరియా పంపిణీ చేయనున్నారు. అంటే రైతులు ఎన్ని ఎకరాల్లో పంటలు సాగు చేస్తున్నారు అనే వివరాల ఆధారంగానే యూరియా పంపిణీ జరగబోతుంది. దీనికోసం రైతుల(Farmers) పట్టాదారు పాసుక్కుల నుంచి వివరాలు సేకరించి.. ఎంత యూరియా అవసరమో లెక్కలు తేల్చేందుకు అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. రైతులు తాము సాగు చేసే పొలం విస్తీర్ణం కంటే ఎక్కువ యూరియా తీసుకోకుండా ప్రత్యేక యాప్ని అభివృద్ధి చేస్తున్నారు.
ఆధార్ లింక్ ఈ-పాస్ యంత్రాలతో నియంత్రణ
గత నెల నుంచి ఆధార్ లింకుతో ఈపాస్ యంత్రాల ద్వారా యూరియా, ఇతర మందుల అమ్మకాలు జరుగుతున్నాయి. రైతుకు ఉన్న భూమికి ఎంత యూరియా అవసరమో అంతే తీసుకునేలా చర్యలు చేపట్టారు. దీని వల్ల అధికారులను తప్పుదోవ చట్టించి బ్లాక్లో అమ్మడం కోసం ఎక్కువ యూరియా తీసుకుంటే దొరికిపోతారు. దీని వల్ల బ్లాక్ మార్కెట్ను కట్టడి చేయవచ్చని భావిస్తున్నారు. కాగా రాష్ట్ర ప్రభుత్వం ఈ సీజన్కు 10.40 లక్షల టన్నుల యూరియా నిల్వలు అవసరమని కేంద్రానికి లేఖ రాసింది.
6 లక్షల టన్నుల యూరియా అవసరమని ప్రాథమిక అంచనా
ఈ నెలాఖరు వరకు నెలకు 2 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా సరఫరా చేయాలని కోరింది.. అయితే, ఇప్పటివరకు రెండు నెలలకు సంబంధించిన యూరియా నిల్వల్లో నగం మాత్రమే రాష్ట్రానికి వచ్చిందని వ్యవసాయ శాఖ తెలిపింది. అక్టోబరు సంబంధించి 37 వేల టన్నులు, నవంబర్ నెలకు సంబంధించిన 25 వేల టన్నుల యూరియా రాష్ట్రానికి చేరింది. రాష్ట్రంలో అక్టోబర్ నుండి ఇప్పటివరకు 3.10 లక్షల టన్నులు సరఫరా జరిగింది. ఇప్పటికే మండల వ్యవసాయ శాఖ అధికారులు వంటలు వేసిన రైతులు ఏమేరకు యూరియా వాడకం చేస్తారో పట్టాపాసు బుక్ వివరాలు ఇచ్చి నమోదు చేసుకోవాలని సూచించారు. ఇప్పటివరకు అధికారులు వివరాల ప్రకారం 6 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేశారు. కేంద్రం మిగతా యూరియా కోటాను త్వరగా పంపాలని కోరుతున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: