తెలంగాణ (TG) గ్లోబల్ సమ్మిట్‌కు ఏర్పాట్లు చకచకా సాగిపోతున్నాయి. 2047నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా సమ్మిట్ నిర్వహించనున్నారు. గ్లోబల్ సమ్మిట్-2047 తొలి రోజు పలువురు ప్రముఖులు ప్రసంగించనున్నారు.
Read Also: Cold Wave Alert: తెలంగాణలో చలి తీవ్రత పెరుగుతోంది
వేదికపై ప్రముఖులు

నోబెల్ శాంతి బహుమతి గ్రహీతలు అభిజిత్ బెనర్జీ, కైలాష్ సత్యార్థి, వరల్డ్ ఎకనామిక్ సమ్మిట్ సీఈవో జెరెమీ జుర్గెన్స్, ట్రంప్ మీడియా-టెక్నాలజీ గ్రూప్ సీఈవో ఎరిక్ స్వైడర్, బయోకాన్ ఎగ్జిక్యూటివ్ ఛైర్‌పర్సన్ కిరణ్ మజుందార్ షా మాట్లాడనున్నారు. ఈ నెల 8న మధ్యాహ్నం ప్రారంభమయ్యే సమ్మిట్ 9న రాత్రి ముగియనుంది.
తెలంగాణను (TG) ప్రపంచ స్థాయి ఆర్థిక శక్తిగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. 42 దేశాలకు చెందిన 1361 సంస్థలు సమ్మిట్‌లో పాల్గొననున్నాయి. ఈ సమ్మిట్‌తో రాబోయే రెండు దశాబ్దాల పాటు అభివృద్ధికి బలమైన పునాది పడనుంది.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: