తెలంగాణలో (TG) మరో పథకం అమలు దిశగా కసరత్తు జరుగుతోంది. కాంగ్రెస్ (Congress) ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో ఇప్పటికే కొన్ని అమలు చేసింది. ఇతర హామీల అమలు పైన ప్రభుత్వం వివరాలు సేకరిస్తోంది. అందులో భాగంగా 2023 ఎన్నికల సమయంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మీ పథకం కింద అర్హులకు రూ లక్ష వరకు అందిస్తామని హామీ ఇచ్చారు. దీంతో పాటుగా పది గ్రాముల బంగారం ఇస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు. ఇప్పుటి వరకు తెలంగాణ ప్రభుత్వం ఆర్టీసీలో ఉచిత ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, రూ.500లకే గ్యాస్ సిలిండర్ వంటి పథకాలు అమలు చేస్తున్నారు. మూడు విడతల్లో రెండు లక్షల వరకు రుణమాపీ అమలు చేసారు. దీంతో, ఇతర పథకాల పైన ఇప్పుడు ఫోకస్ చేసారు. అందులో భాగంగా కల్యాణలక్ష్మీ పథకం కోసం అర్హుల నుంచి ప్రభుత్వం దరఖాస్తులను సేకరించింది. బడ్జెట్ లోనూ ప్రభుత్వం ఈ పథకం కోసం రూ 2,175 కోట్లు ప్రతిపాదన చేసింది.
Read Also: Farmhouse : కేటీఆర్, హరీశ్ రావు లతో కేసీఆర్ భేటీ

వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి అమలుకి
ప్రభుత్వ లెక్కల ప్రకారం కల్యాణ లక్ష్మి పథకం కోసం 65,026 మంది దరఖాస్తు చేసుకున్నారు. మరో 31,468 దరఖాస్తులు పెండింగ్ లో ఉన్నాయి. (TG) అర్హతను పరిశీలించి తిరస్కరణకు గురైనవి కాకుండా..24,038 దరఖాస్తులకు నిధులు మంజూరు చేయాలని నిర్ణయించారు. నిధుల జమ వీటితో పాటుగా అర్హత పొంది నిధులు లేక పెండింగ్ లో ఉన్న లబ్దిదారులకు నిధులను మంజూరు చేయనున్నారు. నిధుల సమీకరణ పైన కసరత్తు చేస్తున్న ప్రభుత్వం త్వరలోనే ఈ పథకం కింద లబ్దిదారుల ఖాతాల్లో నగదు జమ చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం ఈ పథకం పైన ఒక అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. అయితే, వచ్చే ఆర్దిక సంవత్సరం (ఏప్రిల్ 1) నుంచి ఈ పథకం అమలు చేస్తారనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో జరుగుతోంది. మాఘమాసం ఫిబ్రవరి నెల నుంచి మొదలవు తుండటంతో అప్పటి నుంచి పెళ్లిళ్లు చేసుకున్న వారికి మాత్రమే ఈ పథకం వర్తించేలా నిబంధన లను రూపొందిస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: