తెలంగాణ (TG) రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికల ప్రక్రియ ఉత్కంఠభరితంగా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ రేపు జరగనుంది.(TG) రెండో విడతలో 4,332 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా, 5 చోట్ల నామినేషన్లు దాఖలు కాలేదు. 415 గ్రామాల్లో సర్పంచ్‌లు ఏకగ్రీవమయ్యారు. దీంతో మిగిలిన 3,906 సర్పంచ్ స్థానాలకు 13,128 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు.
Read Also: TG Weather: తెలంగాణలో చలి.. వచ్చే మూడు రోజులు జాగ్రత్త

నేటి నుంచే ఏర్పాట్లు
ఇక 38,322 వార్డులకు గాను 107 వార్డుల్లో ఎవరూ నామినేషన్లు వేయలేదు. 8,304 వార్డు సభ్యులు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన 29,903 వార్డులకు 78,158 మంది పోటీ పడుతున్నారు. పోలింగ్ కోసం పాఠశాలలు ఉపయోగిస్తుండటంతో నేటి నుంచే ఏర్పాట్లు చేయనున్నారు. దీంతో ఇవాళ, రేపు(సండే) ఆయా స్కూళ్లకు సెలవు ఇచ్చారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: