సభలో ప్రవేశపెట్టిన మంత్రి దామోదర రాజనర్సింహ
హైదరాబాద్ : రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఎర్త్ సైన్స్ యూనివర్సిటీకి చట్టబద్ధత లభించనుంది. కొత్తగూడెంలో ఏర్పాటు చేసిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ (TG) యూనివర్సిటీకి చట్టబద్ధత కల్పించడం కోసం తెలంగాణ యూనివర్సిటీల చట్ట సవరణ బిల్లు 2026కు శాసనసభ సోమవారం ఆమోదం తెలిపింది. సోమవారం శాసనసభ సమావేశాలు ప్రారంభం కాగానే ప్రశ్నోత్తరాలను చేపట్టారు. ప్రశ్నోత్తరాలు ముగియగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) తరఫున సభలో యూనివర్సిటీ చట్టసవరణ బిల్లును వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రవేశ పెట్టారు. గతేడాది డిసెంబర్లో యూనివర్సిటీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి యూనివర్సిటీని ప్రారంభిన విషయం తెలిసిందే.
Read also: Vikarabad: రైలులో ముఖం కడుక్కుంటూ జారిపడి యువకుడి దుర్మరణం

కొత్తగూడెం విద్యా హబ్ దిశగా అడుగు
ఖనిజ సంపదకు నెలవైన కొత్తగూడెం ప్రాంతాన్ని విద్యా హబ్ గా మార్చే లక్ష ్యంతో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గతేడాది డిసెంబర్లో ప్రారంభించిన డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కి శాశ్వత ప్రాతిపదికన చట్టబద్ధత కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక ముందడుగు వేసింది. (TG) ఈ మేరకు ‘తెలంగాణ యూనివర్సిటీల చట్టం 1991’ని సవరిస్తూ రూపొందించిన బిల్లును ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి తరఫున, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ శాసనసభలో ప్రవేశపెట్టారు. 1978లో స్థాపించిన కొత్తగూడెం స్కూల్ ఆఫ్ మైన్స్ (తర్వాతి కాలంలో ఇంజనీరింగ్ కాలేజీ)ని అప్గ్రేడ్ చేస్తూ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 2025లో సీఎం చేతుల మీదుగా ప్రారంభమైన ఈ వర్సిటీకి, తాజా చట్ట సవరణ ద్వారా పూర్తి అటానమీ (స్వయంప్రతిపత్తి) లభించనుంది.
రూ.500 కోట్లతో వర్సిటీ అభివృద్ధి
దేశ ఆర్థిక సంస్కరణల పితామహుడు, మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలకు నివాళిగా ఈ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టడం జరిగింది. యూనివర్సిటీ అభివృద్ధికి వచ్చే రెండేళ్లలో రూ.500 కోట్లు కేటాయిస్తామని, యూనివర్సిటీ విస్తరణ కోసం 310 ఎకరాల భూమి అందుబాటులో ఉందన్నారు. ప్రపంచంలో ఎర్త్ సైన్సెస్ కోసం ప్రత్యేక వర్సిటీలు ఉండడం చాలా అరుదన్నారు. సింగరేణి గనులు, గోదావరి నది, అటవీ సంపద ఉన్న కొత్తగూడెం ప్రాంతం విద్యార్థులకు ఒక లివింగ్ లాబొరేటరీ గా మారుతుందని మంత్రి తెలిపారు. క్షేత్రస్థాయి పరిశీలనతో కూడిన విద్య ఇక్కడ సాధ్యమవుతుందని మంత్రి తెలిపారు. ప్రస్తుతం ఉన్న బీటెక్ కోర్సులతో పాటు, కొత్తగా బీఎస్సీ (జియాలజీ, ఎన్విరాన్మెంటల్ సైన్స్), ఎంఎస్సీ కోర్సులను ప్రవేశపెట్టనున్నట్టు మంత్రి సభకు తెలిపారు. చట్టబద్ధత వల్ల యూనివర్సిటీకి సొంతంగా కరికులమ్ రూపొందించుకునే స్వేచ్ఛ, యూజీసీ నిధులు, అంతర్జాతీయ సంస్థలతో ఒప్పందాలు (ఎంవోయు కుదుర్చుకునే అవకాశం లభిస్తుందన్నారు.
సింగరేణి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు
సింగరేణి ప్రాంత యువతకు ఉపాధి అవకాశాలు మెరుగు పడతాయని, తెలంగాణను మైనింగ్, జియాలజీ రంగాల్లో గ్లోబల్ లీడర్గా నిలబెట్టేందుకే ఈ యూనివర్సిటీని స్థాపించినట్లు మంత్రి దామోదర రాజనర్సింహ సభకు వివరించారు. చట్టసవరణపై ఎంఐఎం పక్ష నేత అక్బరుద్దీన్ మాట్లాడుతూ యూనివర్సిటీలో కొత్త కోర్సులను ఏర్పాటు చేయాలని, మార్కెట్కి అనుగుణంగా కోర్సులను రూపొందించాలన్నారు. సిపిఐ సభ్యులు కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ఎర్సైన్స్ యూనివర్సిటీ ఏర్పాటు సంతోషకర మన్నారు. యూనివర్సిటీ నిర్వహణలో ఇబ్బందులు రాకుండా, నిధులు ఏర్పాటు చేయాలని సిబ్బంది కొరత లేకుండా చూడాలన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: