తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు ఆలస్యంగా వస్తే వారికి పాఠశాల విద్య శాఖ అధికారులు షాక్ ఇవ్వనున్నారు. ఫేషియల్ రికగ్నిషన్ సిస్టమ్ (FRS) అమలు కారణంగా పాఠశాలలు ప్రారంభమైన తర్వాత ఒక గంట లోపుగా ఉపాధ్యాయుల హాజరు నమోదు కాకపోతే, వెంటనే ఆయా ఉపాధ్యాయులకు మెసేజ్ పంపాలని పాఠశాల విద్య శాఖ అధికారులు యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Read Also: CM Revanth : అసలైన లెక్క మొదలుకాబోతుంది – సీఎం రేవంత్ ఆసక్తికర వ్యాఖ్యలు
ప్రస్తుతం తెలంగాణ (TG) రాష్ట్రంలోని ప్రభుత్వ, స్థానిక సంస్థల ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలల్లో విద్యార్థులతో పాటు, సిబ్బంది హాజరు కోసం ఎఫ్ఆర్‌ఎస్ (FRS) ను అమలు చేస్తున్నారు. తాము రెగ్యులర్‌గా స్కూల్ రాకపోతే తల్లిదండ్రులకు మెసేజ్‌లు వెళుతుండటంతో విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు వస్తున్నట్టు అధికారులు చెబుతున్నారు. ఎఫ్ఆర్‌ఎస్ అమలు ప్రారంభించినప్పటి నుంచి ఇటు విద్యార్థులతో పాటు, అటు ఉపాధ్యాయుల హాజరు కూడా గణనీయంగా పెరిగింది (విద్యార్థుల హాజరు 70-75%, టీచర్ల అటెండెన్స్ 80-85%).

హాజరు కాకపోవడానికి కారణం అడగాలని నిర్ణయం
పాఠశాలలు ప్రారంభమైన తరువాత గంట లోపుగా ఉపాధ్యాయులు హాజరు కాకపోతే, సంబంధిత పాఠశాల హెడ్ మాస్టర్ (HM) ద్వారా గానీ లేదా మండల విద్యాధికారి (MEO) ద్వారా గానీ “ఎందుకు పాఠశాలకు హాజరు కాలేదు?” అని పేర్కొంటూ మెసేజ్ చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు.
దీని ద్వారా ఆ ఉపాధ్యాయుడు/ (teacher) ఉపాధ్యాయురాలు సెలవు తీసుకున్నారా, లేకపోతే ఆలస్యంగా వస్తామని అనుమతి తీసుకున్నారా, లేదా ఇంకేదైనా కారణం ఉందా అనేది ఉన్నతాధికారులు తెలుసుకునే వీలుంటుందని భావిస్తున్నారు. కొందరు ఉపాధ్యాయులు సెలవు తీసుకోకుండా, అనుమతి లేకుండా పాఠశాలకు హాజరు కాకుండా ఉండే పరిస్థితులు ఉంటున్న నేపథ్యంలో, పాఠశాల విద్య శాఖ ఉన్నతాధికారులు ఇటువంటి కఠిన నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో మొత్తం 26,417 ప్రభుత్వ, స్థానిక సంస్థల పాఠశాలలు ఉండగా, వాటిలో సుమారు 1.08 లక్షల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: