ఆర్థిక పరిస్థితి బాగున్నా సరే వివిధ పథకాల్లో లబ్ది పొందడం కోసం అనేక మంది రేషన్ కార్డులు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో గడిచిన 10 నెలల్లో తెలంగాణ (TG) లో 1,40,947 రేషన్ కార్డుల రద్దు చేసింది కేంద్రం. 2020 నుంచి పోల్చితే ఈ ఏడాదే అత్యధికంగా రేషన్ కార్డులు రద్దు చేసినట్లు కేంద్ర గణాంకాలు చెబుతున్నాయి.. బుధవారం ఎంపీ రామసహాయం రఘురామ్ రెడ్డి (MP Ramasahayam Raghuram Reddy) సహా ఇతర ఎంపీలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి నిముబెన్ జయంతిభాయ్ బంభానియా లిఖిత పూర్వక సమాధానమిచ్చారు.
Read Also: Ramachandra Rao: రాజకీయ స్వలాభం కోసమే జిహెచ్ఎంసీ విస్తరణ

తొలగింపుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదు
2020లో 1254, 2022లో 4988, 2023లో 34,064, 2024లో 3424, 2025లో (అక్టోబర్ వరకు) 1,40,947 రేషన్ కార్డులను రద్దు చేసినట్లు కేంద్రమంత్రి లోక్‌సభలో తెలిపారు. అయితే ఈ రేషన్ కార్డుల తొలగింపుపై ఎలాంటి ఫిర్యాదులు అందలేదని వెల్లడించారు. కాగా ప్రస్తుతం తెలంగాణ (TG)లో మొత్తం 56,60,367 రేషన్ కార్డులు అమలులో ఉన్నాయని కేంద్రమంత్రి తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: