తెలంగాణ రాష్ట్ర రైతాంగానికి ప్రభుత్వం మరోసారి శుభవార్త అందించేందుకు సిద్ధమైంది. యాసంగి సాగు పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ, రైతులకు అవసరమైన పెట్టుబడి సాయం అందించాలనే ఉద్దేశంతో రైతు భరోసా (former support) నిధులను త్వరలోనే విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సంక్రాంతి పండుగ నాటికి ఈ డబ్బులు రైతుల బ్యాంకు ఖాతాల్లోకి జమయ్యే అవకాశాలు ఉన్నట్లు అధికార వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఇప్పటికే వానాకాలం సీజన్‌లో తొమ్మిది రోజుల్లోనే భారీగా నిధులు జమ చేసి ప్రభుత్వం రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే.
Read also: TG EAPCET: ఏప్రిల్ చివరి వారంలో నిర్వహణకు అవకాశం

Yasangi farmer support funds will be released soon
ప్రక్రియను జనవరి రెండో వారం నాటికి పూర్తి
రాష్ట్రంలో ప్రతి ఏడాది రెండు పంట సీజన్లకు కలిపి ఎకరానికి రూ.12,000 చొప్పున రైతు భరోసా కింద పెట్టుబడి సాయం అందిస్తోంది. వానాకాలం సీజన్‌లో సుమారు 69 లక్షల మంది రైతులకు రూ.9,000 కోట్లకు పైగా నిధులు నేరుగా ఖాతాల్లో జమయ్యాయి. ప్రస్తుతం యాసంగి సీజన్‌కు సంబంధించిన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను జనవరి రెండో వారం నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ పథకం కోసం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.18,000 కోట్లను కేటాయించారు.
ఉపగ్రహ చిత్రాలు, డిజిటల్ మ్యాపింగ్‌ను
ఈసారి రైతు భరోసా అమలులో ప్రభుత్వం కొన్ని కీలక మార్పులు చేసింది. సాగు చేయని భూములకు నిధులు వెళ్తున్నాయన్న విమర్శలకు చెక్ పెట్టేందుకు ఉపగ్రహ చిత్రాలు, డిజిటల్ మ్యాపింగ్‌ను వినియోగిస్తున్నారు. పంటలు సాగు చేస్తున్న భూములకే సాయం అందించేలా నిబంధనలు కఠినతరం చేస్తున్నారు. దీని వల్ల నిజమైన రైతులకు మాత్రమే లబ్ధి చేకూరనుండగా, ప్రభుత్వ ఖజానాపై భారం కూడా తగ్గనుంది. యాసంగి సాగు సమయంలో నగదు అందుబాటులోకి రావడం వల్ల విత్తనాలు, ఎరువులు సకాలంలో కొనుగోలు చేయగలుగుతారని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: