ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ సిబ్బంది కొరత సమస్య గణనీయంగా ఉంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఇచ్చినప్పటి నుండి రద్దీలు పెరుగుతున్నాయి, కానీ అందుకు సరిపడా బస్సులు, సిబ్బంది అందుబాటులో లేరు. దీంతో ప్రస్తుతం విధులు నిర్వహిస్తున్న కండక్టర్లు, డ్రైవర్లు అదనపు భారాన్ని భరిస్తున్నారు. ఈ సమస్యను అధిగమించడానికి, ఖమ్మం జిల్లా (kammam district) ఆర్టీసీ అధికారులు కాంట్రాక్ట్ పద్ధతిలో 63 కండక్టర్లను నియమించేందుకు దరఖాస్తులను ఆహ్వానించారు. నియామకాల ద్వారా సిబ్బంది లోపం తగ్గి, ప్రస్తుత కండక్టర్లపై ఒత్తిడి కూడా తగ్గుతుందని ఆశిస్తున్నారు.
Read also: HYD Railway: ఆ జంక్షన్‌లో రూ.320 కోట్లతో RORకు గ్రీన్ సిగ్నల్!

Conductor jobs
ప్రస్తుత స్థితిలో ఖమ్మం రీజియన్‌లో 562 బస్సులు ఉన్నాయి, కానీ 907 మంది కండక్టర్లు మాత్రమే ఉన్నారు. వీటిలో డ్రైవర్లు మరియు కండక్టర్లు ఇద్దరూ ఉన్న బస్సులు కేవలం 385. కొత్త నియామకాల ద్వారా ఆర్టీసీ సిబ్బంది లోపం తగ్గి, బస్సు రద్దీలు తగ్గి, ప్రయాణికుల సౌకర్యం మెరుగుపడుతుంది. అలాగే ఈ నియామకాలు కాంట్రాక్ట్ పద్దతిలో ఉండటంతో, భవిష్యత్తులో కూడా సిబ్బంది సమస్యలను సమర్థవంతంగా నిర్వహించగలుగుతారు.
అభ్యర్థులకుండాల్సిన అర్హతలు
- అభ్యర్థి పదోతరగతి ఉత్తీర్ణత కలిగి ఉండాలి
- వయస్సు 21–35 మధ్య ఉండాలి
- పురుషుల కనీస ఎత్తు 153 సెం.మీ, మహిళల కోసం 147 సెం.మీ
- ఆర్టీఏ జారీ చేసిన కండక్టర్ లైసెన్స్ తప్పనిసరి
- కాంట్రాక్ట్ కండక్టర్లకు నెలకు రూ.17,969 వేతనం
- ఖమ్మం రీజియన్‌లో 7 డిపోలు కవర్ అవుతూ, మొత్తం 63 పోస్టులు భర్తీ చేయనున్నాయి
- ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత డిపో కార్యాలయాల్లో సంప్రదించాలి
- నియామకాలు కాంట్రాక్ట్ పద్దతిలో ఉండటం వల్ల సిబ్బంది లోపాన్ని తక్షణమే సవరించగలుగుతారు
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: