బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని కేటీఆర్ (KTR) తీవ్రంగా విమర్శించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన కాంగ్రెస్, చివరకు వాటిని 17 శాతానికి తగ్గించిందని ఆయన ఆరోపించారు. రిజర్వేషన్ల కోతపై రాహుల్ గాంధీ స్పష్టమైన సమాధానం చెప్పాల్సిన బాధ్యత ఉందని కేటీఆర్ అన్నారు. కులగణనను ఆదర్శంగా చెబుతూ, అమల్లో మాత్రం వెనక్కి తగ్గటం ప్రజలను మోసం చేయడమేనని వ్యాఖ్యానించారు.
Read also: Gram Panchayat elections: కోడ్ కూసింది.. అమల్లోకి ఎలక్షన్ రూల్స్

Reduction of reservations, misuse of public money
టెక్స్‌టైల్ హబ్‌గా
వరంగల్ పర్యటన సందర్భంగా మాట్లాడుతూ, ఈ జిల్లాకు పత్తి పంట, అజంజాహీ మిల్లుల వల్ల ఉన్న ప్రత్యేకతను గుర్తుచేసిన కేటీఆర్, కేసీఆర్ హయాంలో ఏర్పాటైన టెక్స్‌టైల్ పార్క్ వరంగల్‌కు మళ్లీ గుర్తింపు తెచ్చిందని చెప్పారు. టెక్స్‌టైల్ హబ్‌గా జిల్లాకు కొత్త అవకాశాలు ఏర్పడ్డాయని పేర్కొన్నారు. కాంగ్రెస్ మాత్రం అభివృద్ధి పేరుతో ఫ్యూచర్ సిటీ ప్రాజెక్ట్‌ను రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వేదికగా మార్చిందని ఆయన ఆరోపించారు.
తెలంగాణను ఆర్థిక వనరుల కేంద్రంగా
9300 ఎకరాల పారిశ్రామిక భూములను విక్రయించి తెలంగాణను ఆర్థిక వనరుల కేంద్రంగా ఉపయోగించాలన్న ఆలోచనతో ప్రభుత్వం ముందుకెళ్తోందని కేటీఆర్ విమర్శించారు. ఫార్మా సిటీ ఏర్పాటు ద్వారా కాలుష్య పరిశ్రమలను నగర0 బయటికి తరలించినదీ తమ ప్రభుత్వమేనని ఆయన గుర్తుచేశారు. ఇక రేవంత్ రెడ్డి పాలనలో భారీ భూకుంభకోణాలు జరుగుతున్నాయని ఆరోపించి, బీఆర్ఎస్ దీనిపై జోరుగా పోరాడుతుందని స్పష్టం చేశారు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: