హైదరాబాద్ : దాదాపు ఐదు దశాబ్దాలుగా తెలంగాణకు(TG) సేవలందించిన రామగుండం థర్మల్ పవర్ స్టేషన్ మూసివేశారు. రాష్ట్రంలోని 62.5 మెగావాట్ల సామర్థ్యం కలిగిన రామగుండం థర్మల్ స్టేషన్ను అధికారులు పూర్తిగా మూసివేశారు. 1971 అక్టోబర్లో యుఎస్ఎఐడి సహకారంతో స్థాపించిన తొలి థర్మల్ స్టేషన్గా రామగుండం థర్మల్ పవర్ స్టేషన్గా చరిత్రలో నిలిచిపోయింది.
Read also: హైదరాబాద్ లో రియల్టర్ హత్య కలకలం

ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్లాంట్ జీవితకాలం ముగింపు
ఈ ప్లాంట్(TG) మొత్తం 18743.4 మిలియన్ యూనిట్ల విద్యుత్(Electricity) ఉత్పత్తి చేసింది. రికార్డు స్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసిన ఈ ప్లాంట్ జీవితకాలం ముగిసిందని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కరువు ప్రభావిత జిల్లాల్లోని వ్యవసాయ పంపుసెట్లకు ఈ యూనిట్ నుంచి విద్యుత్ సరఫరా చేసేవారు. నాలుగు దశాబ్దాలకు పైగా నిరంతరాయంగా సేవలు అందించిన ఈ థర్మల్ స్టేషన్ తాజాగా మూతపడటంతో చారిత్రక ఘట్టంగా నిలిచింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read also: