తెలంగాణను వర్ష భయం వీడటం లేదు. వర్షాలు ఊహించని విధంగా మోస్తరు నుంచి భారీ స్థాయిలో పడుతూ, ప్రజలను నిత్యం అశాంతికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ఉదయం సమయాల్లో వాతావరణం శాంతంగా కనిపించినా, సాయంత్రం నుంచి రాత్రివరకు పరిస్థితి పూర్తిగా మారిపోతోంది. వర్షాలు ఊహించని వేగంతో పడుతూ, రహదారులు జలమయంగా మారుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం విడుదల చేసిన నివేదిక ప్రకారం, మరో రెండు రోజులు — నేడు,రేపు — దక్షిణ, మధ్య తెలంగాణ (Telangana) లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది.ఈ వర్షాలకు ప్రధాన కారణంగా క్యుములోనింబస్ (Cumulonimbus) మేఘాలు నిలవడమని అధికారులు పేర్కొన్నారు. ఈ మేఘాలు తీవ్రమైన వర్షాలు, ఉరుములు, మెరుపులతో కూడిన వాతావరణాన్ని తీసుకురావడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. గురువారం రోజున ఇప్పటికే రాష్ట్రంలో పలుచోట్ల కుండపోత వర్షాలు కురిసినట్టు వాతావరణ శాఖ వెల్లడించింది. ఇదే పరిస్థితి శుక్రవారం, శనివారాల్లోనూ కొనసాగే అవకాశముందని హెచ్చరించింది.
సూచనలు కూడా జారీ చేశారు
హైదరాబాద్ వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం, శుక్రవారం సాయంత్రం 4 గంటల తరువాత మెదక్, సంగారెడ్డి, కామారెడ్డి, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, రంగారెడ్డి, నిర్మల్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు (Heavy rains) కురిసే అవకాశం ఉంది. ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లకూడదని సూచనలు కూడా జారీ చేశారు.ఇంతకుముందు కూడా జూలై చివరి వారంలోనూ భారీ వర్షాలు నమోదయ్యాయి. ఆ సమయంలో వరదల కారణంగా పలు ప్రాంతాల్లో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నదులు, వాగులు పొంగిపొర్లాయి. ఇప్పుడు మళ్లీ వర్షాలు ప్రారంభం కావడంతో ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

భారీ వర్షాలు
ఇక వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం, ఆగస్టు 13వ తేదీన పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. దీని ప్రభావం రాష్ట్రవ్యాప్తంగా ఉంటుంది. ప్రత్యేకంగా ఆగస్టు 13, 14, 15 తేదీల్లో మళ్లీ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని రైతులు, పశువుల యజమానులు, ప్రయాణికులు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ శాఖ సూచించింది.మరోవైపు.. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్నాయి. ఇక గురువారం ఏర్పడిన ఈ ఉపరితల ఆవర్తన ద్రోణి.. శుక్రవారం నాటికి మరింత బలపడింది. దీంతో హైదరాబాద్ నగరంలో వచ్చే 2 గంటల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అధికారులు తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు.
వర్షం రాకముందే మూసుకుపోయిన నాలాలు
అత్యవసరం అయితే తప్ప హైదరాబాద్ నగరంలో ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో బయటికి రావొద్దని సూచించారు.మరోసారి భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికలతో గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ), హైడ్రా సిబ్బంది అలర్ట్ అయ్యారు. వర్షం రాకముందే మూసుకుపోయిన నాలాలు, మ్యాన్ హోల్‌లను సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు.. రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఇప్పటికే వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 30 కిలోమీటర్ల నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది.
వర్షం ఎన్ని రకాలుగా ఉంటుంది?
సన్నటి వాన (Drizzle),సాధారణ వర్షం (Rain),కుండపోత వర్షం (Heavy Rain),పిడుగు సహిత వర్షం (Thunderstorm),మోస్తరు వర్షం (Moderate Rain).
వర్షాన్ని కొలిచే ప్రమాణం ఏమిటి?
వర్షాన్ని మిల్లీమీటర్లలో (mm) కొలుస్తారు. దీనిని వర్షపాతం అంటారు. ఉదాహరణకు – “ఈరోజు 50mm వర్షం కురిసింది.”
Read hindi news: hindi.vaartha.com
Read also: