తెలంగాణలో వర్షాల ఉధృతి మరోసారి పెరగబోతోంది. హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించిన హెచ్చరికల ప్రకారం, రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఈశాన్య బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ద్రోణి ప్రభావంతో నైరుతి రుతుపవనాల విస్తరణ కారణంగా కురుస్తున్నాయి. ఈ పరిస్థితుల ప్రభావం వ్యవసాయ రంగం (Agriculture sector) పై, ప్రజల జీవనంపై, ముఖ్యంగా నగర ప్రాంతాల్లో ట్రాఫిక్ డ్రైనేజీ సమస్యలపై గణనీయంగా ఉండే అవకాశం ఉంది.వర్షాలతో పాటు, పలుచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు గంటకు 30-40 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉందన్నారు.ఈ మేరకు ఆదిలాబాద్, కుమ్రంభీం ఆసిఫాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, నల్లగొండ, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు హెచ్చరికలు జారీ చేశారు.
కొన్ని జిల్లాల్లో
ఈ జిల్లాల్లో నేడు వర్షాలకు అవకాశం ఉన్నందను ఎల్లో అలర్ట్ జారీ చేశారు. గత 24 గంటల్లో రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి వర్షాలు నమోదయ్యాయి. అత్యధికంగా మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలంలో 2.22 సెం.మీ. వర్షపాతం నమోదైంది.సంగారెడ్డి జిల్లా పుల్కల్ (1.89 సెం.మీ.), చౌట్కూర్ (1.86 సెం.మీ.), అందోల్ (1.42 సెం.మీ.) ఖమ్మం రూరల్ (1.49 సెం.మీ.), తిరుమలాయపాలెం (1.37 సెం.మీ.), సూర్యాపేట జిల్లా (Suryapeta District) మద్దిరాల (1.24 సెం.మీ.), యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ (1.04 సెం.మీ.) వర్షపాతం నమోదైంది. రానున్న మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణశాఖ అధికారులు సూచించారు.

వాతావరణ శాఖ
ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురుగాలులు వీచే సమయంలో సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.కాగా, తెలంగాణలో ఈ ఏడాది సరిగ్గా వర్షాలు కురవటం లేదు. ముందుగానే రాష్ట్రంలోకి నైరుతి ప్రవేశించినప్పటికీ, జూన్ నెలలో 28 శాతం లోటు వర్షపాతం నమోదైంది. జులై నెలలో ఇప్పటి వరకు (జులై 13 నాటికి) 13 శాతం వర్షపాతం లోటు నమోదైందని భారత వాతావరణ శాఖ (IMD) గణాంకాలు వెల్లడించాయి. రాష్ట్రంలోని 340 మండలాల్లో లోటు వర్షపాతం నమోదు కాగా, 281 మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాల సమయంలో సాధారణంగా ఏర్పడే అల్పపీడనాలు గత నెల నుంచి ఏర్పడకపోవడమే ఈ లోటు వర్షపాతానికి ప్రధాన కారణమని ఐఎండీ పేర్కొంది.
వర్షం వల్ల ఏయే రకాల ప్రభావాలు ఉంటాయి?
వర్షం పాజిటివ్ (సానుకూల)నెగటివ్ (ప్రతికూల) ప్రభావాలను కలిగిస్తుంది. ఇది పర్యావరణం, వ్యవసాయం, మానవ జీవనశైలి, మౌలిక సదుపాయాలపై ప్రభావం చూపుతుంది.
వర్షం వల్ల లభించే సానుకూల ప్రయోజనాలు ఏమిటి?
వ్యవసాయానికి అవసరమైన నీరు అందుతుంది.గ్రౌండ్ వాటర్ లెవల్స్ పెరుగుతాయి.చెట్లు, మొక్కలు, జలవనరులు పునరుత్తేజితమవుతాయి.పర్యావరణ సమతుల్యత కోసం అవసరమైన భాగంగా వర్షం పని చేస్తుంది.
Read hindi news: hindi.vaartha.com
Read Also: RTC: చేవెళ్లలో ఆర్టీసీ బస్సుల కొరతపై విద్యార్థుల ధర్నా