తెలంగాణ రాష్ట్రానికి మళ్లీ భారీ వర్షాల హెచ్చరికలు జారీ అయ్యాయి. హైదరాబాద్ (Hyderabad) లోని వాతావరణ కేంద్రం అధికారులు తెలిపిన ప్రకారం, రాష్ట్రంపై ద్రోణి ప్రభావం కొనసాగుతుండటంతో నేటి నుంచి మరో రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పారు. ఈ నేపథ్యంలో అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వాతావరణ శాఖ (Department of Meteorology) తాజా అంచనాల ప్రకారం, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో సాధారణ వర్షాలు మాత్రమే కాకుండా, భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని స్పష్టం చేశారు. ముఖ్యంగా నల్లగొండ, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి, జనగాం, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల వంటి జిల్లాల్లో వర్షాల తీవ్రత ఎక్కువగా ఉంటుందని హెచ్చరికలు జారీ చేశారు.
మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం
ఈ జిల్లాలకు అధికారులు ఆరెంజ్, ఎల్లో అలర్టు (Orange, Yellow Alert) లు ప్రకటించారు.ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. ఈ జిల్లాల్లో గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయన్నారు. ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. వరదలు, విద్యుత్ సరఫరాలో అంతరాయాలు, లోతట్టు ప్రాంతాలు జలమయం కావడం వంటివి జరగవచ్చని అంచనా వేశారు.

సాయంత్రం తర్వాత వర్షాలు కురిసే అవకాశం
కాబట్టి ప్రజలు అనవసర ప్రయాణాలు మానుకోవాలన్నారు. వర్షం నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలన్నారు.జగిత్యాల, మేడ్చల్ మల్కాజిగిరి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, ఆదిలాబాద్, హైదరాబాద్, జయశంకర్ భూపాలపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయన్నారు.
ఆయా జిల్లాల్లో రాబోయే రెండు మూడు గంటల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఈ మేరకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ నగరంలో సాయంత్రం తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఆఫీసులు, ఉద్యోగాలకు వెళ్లిన వారు త్వరగా ఇళ్లకు చేరుకోవాలని సూచించారు. అనవసర ప్రయాణాలు మానుకోవాలని.. అత్యవసరం అయితేనే ఇళ్ల నుంచి బయటకు రావాలని చెప్పారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: