తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం (Hyderabad Meteorological Centre) వెల్లడించింది. రాబోయే నాలుగు రోజులపాటు పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు ప్రకటించారు. ఈ వర్షాల కారణంగా కొన్ని ప్రాంతాల్లో రవాణా అంతరాయం, పంటలకు మిశ్రమ ప్రభావం, తక్కువ ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడం వంటి పరిస్థితులు తలెత్తవచ్చని సూచించారు.
వాతావరణ శాఖ తాజా అంచనాల ప్రకారం గురువారం, శుక్రవారం రోజుల్లో ఉత్తర తెలంగాణతో పాటు తూర్పు తెలంగాణ జిల్లాల్లో (Telangana districts) వర్షాలు విస్తృతంగా పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో మోస్తరు నుండి భారీ వర్షాలు నమోదవుతాయని అధికారులు తెలిపారు.

మరికొన్ని జిల్లాలకు
అలాగే శుక్రవారం నాటికి వర్షాల తీవ్రత మరికొన్ని జిల్లాలకు విస్తరించనుంది. వాటిలో మంచిర్యాల, సూర్యాపేట, మహబూబాబాద్, కొమురంభీమ్ ఆసిఫాబాద్ జిల్లాలు (Asifabad Districts) ప్రధానంగా ఉన్నాయి. ఈ జిల్లాల ప్రజలు వర్షాల సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని, వర్షపు నీటిలో ప్రయాణం చేయకూడదని అధికారులు సూచించారు.
ఇదిలా ఉండగా, ఈరోజు సాయంత్రం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సికింద్రాబాద్, బోయినపల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం, ప్యాట్నీ, ప్యారడైజ్, మారేడుపల్లి తదితర ప్రాంతాల్లో వర్షం కురవడంతో నగరవాసులు ఉక్కపోత నుంచి ఉపశమనం పొందారు. అయితే, భారీ వర్షం కారణంగా రహదారులపై నీరు చేరడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
Read hindi news:hindi.vaartha.com
Read Also: