తెలంగాణ పోలీసులు (TG Police) మరోసారి సామాజిక మాధ్యమాల వినియోగదారులకు కీలక హెచ్చరిక జారీ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్, తప్పుడు ప్రచారాలు విస్తృతంగా వ్యాపిస్తున్న నేపథ్యంలో, ప్రజలు వాటిని నమ్మే ముందు ఆలోచించాలని, నిర్ధారించకుండా షేర్ చేయకూడదని పోలీసులు స్పష్టం చేశారు.
Read Also: Telangana: ఇందిరా గాంధీ జయంతి రోజు ఉచిత చీరల పంపిణీ
‘ఎక్స్’ (మాజీ ట్విట్టర్) వేదికగా తెలంగాణ పోలీసులు (TG Police) చేసిన ప్రకటనలో, “సోషల్ మీడియాలో వచ్చే ప్రతి వార్త నిజం కాదు. పంచుకునే ముందు నిజానిజాలు తెలుసుకోండి” అని పేర్కొన్నారు. తప్పుడు వార్తలు సమాజంలో శాంతిభద్రతలను కూడా దెబ్బతీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.
సామాజిక మాధ్యమాల్లో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని
అసత్య వార్తల ప్రచారంలో భాగస్వాములు కావొద్దని హితవు పలికారు. వాట్సాప్ గ్రూపులు, ఇతర సామాజిక మాధ్యమాల్లో (social media) బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, తప్పుడు వార్తలను ప్రచారం చేస్తే చట్టపరమైన చిక్కుల్లో పడతారని హెచ్చరించారు.
సెన్షేషనలిజం కోసం ప్రయత్నించవద్దని ‘ఎక్స్’ (X) వేదికగా సూచించారు.క్రెడిట్ కార్డు వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు. కార్డు లిమిట్ పెంచుతామని మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
ఫేక్ లింక్స్ పంపి మోసగించే అవకాశం ఉందని, అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. కస్టమర్ కేర్ ప్రతినిధులు ఎప్పుడూ ఓటీపీ అడగరని, క్రెడిట్ కార్డు సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని హెచ్చరించారు. సైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: