తెలంగాణ (TG) రాజకీయాల్లో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ వ్యవహారంలో మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు సిట్ అధికారులు అధికారికంగా నోటీసులు జారీ చేశారు. హైదరాబాద్ నందినగర్‌లోని కేసీఆర్ ఇంటికి వెళ్లి CRPC 160 కింద ఆయన పీఏకు నోటీసులు అందజేశారు. రేపు మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు సిద్ధంగా ఉండాలని నోటీసుల్లో పేర్కొన్నారు. అయితే కేసీఆర్ వయసురీత్యా స్టేషన్‌కు రానక్కర్లేదని HYD పరిధిలో కోరిన చోట విచారణ చేస్తామని పేర్కొంది. అయితే కేసీఆర్ ఎర్రవల్లిలోని ఫామ్ హౌస్ నుంచి నందినగర్‌కు వస్తారా? సిట్ అధికారులు అక్కడికే వెళ్తారా అనేది ఉత్కంఠగా మారింది.
Read Also: Sircilla Elections: కేటీఆర్ వాహనాన్ని తనిఖీ చేసిన ఎన్నికల అధికారులు

అధికారుల వాంగ్మూలాల ఆధారంగా
ఈ కేసులో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ అగ్రనేతలను సిట్ విచారించింది. మాజీ మంత్రి హరీష్ రావు, పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మాజీ ఎంపీ సంతోష్ రావులను ఇప్పటికే సిట్ అధికారులు ప్రశ్నించారు. వీరి నుంచి సేకరించిన వివరాలు, అలాగే ప్రస్తుతం జైలులో ఉన్న పోలీసు అధికారుల వాంగ్మూలాల ఆధారంగా కేసీఆర్‌ను విచారించాల్సిన అవసరం ఉందని సిట్ భావిస్తోంది. గత ప్రభుత్వ హయాంలో నిఘా పరికరాల వినియోగం, రాజకీయ నేతల ఫోన్ల నిఘాపై ప్రధానంగా ఈ విచారణ సాగనున్నట్లు తెలిసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: