తెలంగాణలో పంచాయతీ ఎన్నికల( TG Panchayat Elections) వేడి మొదలైంది. మూడు విడతల్లో జరగనున్న ఈ ఎన్నికల్లో డిసెంబర్ 11న తొలి విడత పోలింగ్ జరగనుంది. డిసెంబర్ 14, 17 తేదీలలో రెండో, మూడో విడతలు పూర్తవడంతో అదే రోజు సాయంత్రం ఫలితాలు వెల్లడించనున్నారు. ఈసారి పంచాయతీ ఎన్నికల పోటీ విభిన్నంగా మారింది. ఉన్నత విద్యావంతులు, విదేశాల్లో పనిచేసిన వారు, సాఫ్ట్‌వేర్ సంస్థల యజమానులు కూడా గ్రామ పంచాయతీలలో సర్పంచ్ పదవికి పోటీకి ముందుకువస్తున్నారు.
Read Also: TG: రసవంతంగా పంచాయితీ ఎన్నికలు ..కుటుంబాల మధ్య విభేదాలు
హుస్నాబాద్ మండలం జిల్లెల్లగడ్డ పంచాయతీలో( TG Panchayat Elections) ఒక సాఫ్ట్‌వేర్ కంపెనీ (Software company) స్థాపకుడు లావుడ్య రవీందర్ సర్పంచ్ పదవికి బరిలోకి దిగడంతో స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. ఈ పంచాయతీలో సర్పంచ్ పదవి ఎస్టీ జనరల్‌కు కేటాయించగా, ఆ వర్గానికి చెందిన రవీందర్ నామినేషన్ దాఖలు చేశారు. బీటెక్, ఎంబీఏ చేసిన అనంతరం విదేశాల్లో పనిచేసిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్‌లో సొంత సాఫ్ట్‌వేర్ కంపెనీ నిర్వహిస్తున్నారు.
గ్రామ అభివృద్ధి కోసం తాను ప్రజాప్రతినిధిగా పనిచేయాలనే ఉద్దేశంతోనే పోటీలోకి దిగుతున్నానని రవీందర్ అన్నారు. నామినేషన్ దాఖలు చేసిన సందర్భంగా ఆయన అనుచరులు డప్పుల మోతల మధ్య ఘనంగా స్వాగతించారు. గ్రామ అభివృద్ధికి తాను కట్టుబడి పనిచేస్తానని, ఓటర్లు కూడా తనపై విశ్వాసం ఉంచుతారని రవీందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి సర్పంచ్ ఎన్నికలు కొత్త ధోరణిని సృష్టిస్తున్నాయి. ఉన్నత ఉద్యోగాలు, బిజినెస్‌లు నిర్వహిస్తున్న వారు కూడా గ్రామ స్థాయి రాజకీయాల్లో భాగస్వామ్యం కావడం రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక చర్చనీయాంశంగా మారింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: