హైదరాబాద్: టీమిండియా మాజీ కెప్టెన్, తెలంగాణ మంత్రి(TG Minister) మహమ్మద్ అజారుద్దీన్(Azharuddin) ఈరోజు తన శాఖల బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో కుటుంబ సభ్యులు, ముస్లిం మత పెద్దల ప్రార్థనల మధ్య ఆయన అధికారికంగా విధుల్లో చేరారు. ఆయనకు కేటాయించిన మైనార్టీల సంక్షేమం(Welfare of minorities) మరియు పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖల మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.
Read Also: Supreme court: స్పీకర్‌పై కేటీఆర్ ధిక్కార పిటిషన్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు
ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ మాట్లాడుతూ, తనపై ఎంతో నమ్మకం ఉంచి ఈ గురుతర బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి(Revanth Reddy) కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యమంత్రి తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా చిత్తశుద్ధితో పనిచేస్తానని ఆయన స్పష్టం చేశారు. మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన అజారుద్దీన్‌కు పలువురు అధికారులు, నేతలు, సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు.
ప్రమాణ స్వీకారం, శాఖల కేటాయింపు వివరాలు
గత నెల 31వ తేదీన అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. రాజ్‌భవన్‌లో ఆయన చేత గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రమాణం చేయించారు. అనంతరం నవంబర్ 4వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయనకు మైనార్టీ సంక్షేమం, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖలను కేటాయించారు. తాజాగా ఆయన ఈ శాఖల బాధ్యతలను అధికారికంగా స్వీకరించారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: