హైదరాబాద్ : నిర్మాణాల్లో(TG) భద్రతా ప్రమాణాల అమలులో విశేష ప్రతిభకనబరుస్తూ తెలంగాణ రోడ్లు-భవనాల శాఖ జాతీయస్థాయిలో గుర్తింపు పొందింది. నేషనల్ సేఫ్టీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకటించిన జాతీయ భద్రతా అవార్డును రాష్ట్ర ఆర్అండ్బి శాఖ ఎంపికైంది. వరంగల్ రంగంపేటలో నిర్మాణం జరుగుతున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పనుల్లో భద్రతా ప్రమాణాలు, పర్యవేక్షణ, కార్మిక భద్రత చర్యలు సమర్థంగా అమలైనందుకు ఈ అవార్డు లభించింది.
Read also: పలాశ్ ముచ్చల్ తో స్మృతి వివాహం జరిగేనా?

ఎన్ఎస్సిఐ పరిశీలనలో తెలంగాణ ఆర్ అండ్ బి శాఖ పనితీరు
ఎన్ఎస్సిఐ పరిశీలనలో(TG) భాగంగా ప్రాజెక్టు అమలు విధానం, భద్రతా ప్రోటోకాల్లు, మానిటరింగ్ సిస్టమ్, ప్రమాద నివారణ చర్యలు వంటి అంశాలను విశ్లేషించగా, రాష్ట్రం పాటించిన విధానం ఆదర్శంగా నిలిచిందని అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా రోడ్లు-భవనాల శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం చేపడుతున్న నిర్మాణాల్లో భద్రత అత్యంత ప్రాధాన్యం పొందుతుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) నాయకత్వంలో ప్రాజెక్టులు వేగంగా పూర్తవడంతో పాటు నాణ్యత, భద్రత, స్థిరత్వం కచ్చితంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం. గత పది సంవత్సరాల్లో రాష్ట్రంలో ఆర్ అండ్ బి పరిధిలో సుమారు ఒక కోటి చదరపు అడుగుల ప్రభుత్వ నిర్మాణాలు జరిగితే, ప్రజా ప్రభుత్వం ఏర్పాటై నేను ఆర్ అండ్ బి శాఖ మంత్రి అయిన ఈ రెండు సంవత్సరాల్లోనే దాదాపుగా అదే స్థాయిలో కోటి చదరపు అడుగులు నిర్మాణాలు జరుగుతుండడం, ఆర్ అండ్బి శాఖ పనితీరుకు నిదర్శనమని మంత్రి పేర్కొన్నారు.
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: