हिन्दी | Epaper

TG: గత పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయన్న కేటీఆర్ కేటీఆర్

Saritha
TG: గత పరిస్థితులే మళ్లీ కనిపిస్తున్నాయన్న కేటీఆర్ కేటీఆర్

క్యాలెండర్‌లో తేదీలు, సంవత్సరాలు కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓట్లు వేసిన ప్రజల జీవితాల్లో మాత్రం మార్పు రావడం లేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక జీవితాల్లో మార్పులు ఏమో గానీ, (TG) తెలంగాణ రాకముందు పరిస్థితులు ఏర్పడుతున్నాయన్న కేటీఆర్. తెలంగాణ భవన్‌లో ఆయన బీఆర్ఎసస్ పార్టీ నూతన సంవత్సర డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రాష్ట్రం రెండు సంవత్సరాలుగా అభివృద్ధి వైపు కాకుండా తిరోగమనం వైపు ప్రయాణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పడక ముందు, కేసీఆర్ ముఖ్యమంత్రి కాకముందు ఉన్న పరిస్థితులు తిరిగి వస్తున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రైతులు యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. కేంద్రంతో, సమైక్యవాదులతో కేసీఆర్ నాయకత్వంలో 14 సంవత్సరాలు పోరాటం చేసి తెలంగాణ సాధించామని అన్నారు.

Read also: NEW YEAR 2026: ఆల్కహాల్ రీడింగ్ చూసి పోలీసులు అవాక్కు

TG

తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్

కేసీఆర్ పదేళ్ల కాలంలో తెలంగాణలో అభివృద్ధి పరుగులు పెట్టిందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలు సమస్యలపై బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు బలంగా గళమెత్తారని కేటీఆర్ అన్నారు. (TG) గెలుపోటములు శాశ్వతం కాదని, తాత్కాలికమని గుర్తు పెట్టుకోవాలని అన్నారు. తెలంగాణ ప్రజల గుండెల్లో కేసీఆర్ (KCR) స్థానం, గులాబీ జెండా శాశ్వతమని అన్నారు. ఇతర పార్టీలకు తెలంగాణ రాజకీయాలు ఒక ఆట అయితే, బీఆర్ఎస్‌కు సంక్షేమం, అభివృద్ధి ముఖ్యమని అన్నారు. కేంద్రం, రాష్ట్రం కలిసి, రెండు పార్టీలు ఒకటై బీఆర్ఎస్‌పై దాడి చేస్తున్న విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. ప్రజల దీవెన, దైవ ఆశీర్వాదం ఉన్నంతకాలం ఎవరూ ఏమీ చేయలేరని ధీమా వ్యక్తం చేశారు. ఎన్ని కుట్రలు చేసినా బీఆర్ఎస్‌ను అణచివేయడం ఎవరికీ సాధ్యం కాదని కేటీఆర్ అన్నారు. 2028లో తిరిగి కేసీఆర్‌ను ముఖ్యమంత్రిగా చూడటమే బీఆర్ఎస్ లక్ష్యమని, అదే తమ ధ్యేయమని, ఆ దిశగా ముందుకు సాగాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.

Read hindi news:hindi.vaartha.com

Epaper: epaper.vaartha.com

Read also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

రేపు జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో కావూరి అంత్యక్రియలు

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

ఏప్రిల్ 1 నుంచి HDFC లో భారీ మార్పులు!

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

భారత్‌కు వస్తున్న నౌకపై దాడి.. ముగ్గురు గల్లంతు

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

రాజకీయ నేతల గురించి ఒక్క పదంలో తేల్చేసిన కవిత

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

4 ఏళ్ళకే వైవాహిక బంధానికి స్వస్తి పలికిన స్టార్ హీరోయిన్

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

టీ20 ర్యాంకింగ్స్‌లో భారత్ జోరు.. టాప్ 2 మనోళ్లే

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

నర్మెట్టాలో ఆయిల్ ఫాం ఫ్యాక్టరీని ప్రారంభించనున్న రేవంత్ రెడ్డి

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

ఫుకెట్‌లో ఎయిరిండియా విమానానికి తప్పిన ప్రమాదం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

విద్యుత్ ఛార్జీలు మరింత తగ్గిస్తాం.. సీఎం

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

ఇజ్రాయెల్‌పై ఇరాన్ క్షిపణుల వర్షం: దద్దరిల్లిన టెల్ అవీవ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

రెండు భారీ చిత్రాలతో ‘అల్లు సినిమాస్’ గ్రాండ్ ఓపెనింగ్

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

స్కూల్స్, కాలేజీల అభివృద్ధికి తమ ఉదారతను చాటుకున్న దంపతులు

📢 For Advertisement Booking: 98481 12870