
ఇటీవల ఐఏఎస్ మహిళా అధికారుల (TG) పట్ల సోషల్ మీడియాలో జరుగుతున్న అసభ్యకర ప్రచారాన్ని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komatireddy Venkat Reddy) తీవ్రంగా ఖండించారు. నన్ను మానసికంగా చంపుతున్నారని మంత్రి కోమటిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.
Read also: Nizamabad: కవిత స్థానంలో ఎమ్మెల్సీ అభ్యర్థిగా అజారుద్దీన్?
సోషల్ మీడియా దుష్ప్రచారంపై కోమటిరెడ్డి తీవ్ర ఆవేదన
శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ ‘నన్ను చంపాలంటే ఇంత విషం ఇచ్చి చంపండి నాకు జీవితం మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదు’ అని అన్నారు. (TG) మహిళా అధికారులపై చెప్పలేని భాషలో వార్తలు రాయడం హేయమైన చర్య. మీడియా సోదరులకు కూడా ఇంట్లో అక్కాచెల్లెళ్లు ఉంటారు, మీ కుటుంబ సభ్యులపై ఇలాంటి వార్తలు వస్తే ఎలా ఉంటుంది? అని ఆయన ప్రశ్నించారు. ముఖ్యంగా కలెక్టర్ హరిచందన వంటి సీనియర్ అధికారులను మానసిక వేదనకు గురిచేయడం సరికాదన్నారు.
తనపై జరుగుతున్న దుష్ప్రచారంపై మంత్రి భావోద్వేగానికి లోనయ్యారు. నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం చచ్చిపోయాను. దేవుడిని నమ్ముకుని ప్రతీక్ ఫౌండేషన్ ద్వారా సేవ చేస్తున్నాను. నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టకండి అని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళా అధికారుల వ్యవహారంపై DGPతో మాట్లాడి ఎంక్వైరీ వేయమన్నానని, 20 రోజుల్లో నిజానిజాలు బయటకు వస్తాయని, బాధ్యులపై కఠిన చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నల్గొండ జిల్లా కలెక్టర్ల బదిలీలు ముఖ్యమంత్రి నిర్ణయమని, దానికి మంత్రితో సంబంధం పెట్టొదని ఆయన కోరారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper:epaper.vaartha.com
Read also: