బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌కు మాజీ మంత్రి హరీశ్‌రావుతో రాజకీయ ప్రమాదం ఉందంటూ టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హరీశ్‌రావు విషయంలో కేసీఆర్ (KCR) చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించిన ఆయన, ముఖ్యమంత్రి కావాలనే ఆశ ఎవరికైనా సహజమేనని వ్యాఖ్యానించారు. ఢిల్లీ పర్యటనలో మీడియాతో మాట్లాడిన మహేశ్ గౌడ్, ఏ క్షణంలోనైనా రాజకీయంగా వెన్నుపోటు జరిగే అవకాశం ఉందని హెచ్చరించడం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది.
Read also: SCR Sankranti trains India : సంక్రాంతికి ప్రత్యేక రైళ్లు.. అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభం…

KCR should be cautious in the case of Harish Rao
బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు
అదే సమయంలో బీఆర్ఎస్ నేతలపై తీవ్ర విమర్శలు చేసిన మహేశ్ గౌడ్, కేటీఆర్ డబ్బుతో సోషల్ మీడియాను నియంత్రిస్తున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వంపై మాట్లాడుతూ, తనకు మంత్రి పదవిపై ఎలాంటి ఆసక్తి లేదని, టీపీసీసీ అధ్యక్షుడిగానే సంతోషంగా ఉన్నానన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ అభివృద్ధిపై స్పష్టమైన విజన్ ఉందని, హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని ధీమా వ్యక్తం చేస్తూ, కాంగ్రెస్ సంక్షేమ పాలనతో రాబోయే ఎన్నికల్లో పార్టీ సునాయాసంగా గెలుస్తుందని విశ్వాసం తెలిపారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: