TG: పంచాయతీ ఎన్నికలు గ్రామాల్లో భారీ ఉత్సాహాన్ని రేకెత్తిస్తున్నాయి. ఎన్నాళ్లుగానో అవకాశాన్ని ఎదురు చూసిన ఆశావహులు ఈసారి తప్పకుండా బరిలోకి దిగాలని నిర్ణయించుకున్నారు. రిజర్వేషన్లు అనుకూలంగా ఉండటంతో యువతలో పోటీ ఆతృత మరింత పెరిగింది. కొంతమంది గ్రామాల్లో కుటుంబ సభ్యులే పరస్పరం పోటీ పడుతూ ఎన్నికల(Panchayat Elections) రంగాన్ని రసవత్తరం చేస్తున్నారు. ఒక గ్రామంలో 91 ఏళ్ల వృద్ధుడు కూడా ఎన్నికల అఖాడాలో అడుగు పెట్టడంచర్చనీయాంశమైంది. కొంతమంది అభ్యర్థులు ఉచిత సేవలు, సౌకర్యాల హామీలతో ఓటర్లను ఆకర్షిస్తుండగా, మరికొందరు బాండ్ పేపర్లపై తమ వాగ్దానాలు రాసి ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు.
Read Also: TELANGANA RISING GLOBAL SUMMIT 2025 : సీఎం రేవంత్ పై సోనియా ప్రశంసలు

సర్పంచ్ స్థానాన్ని గెలుచుకునేందుకు అభ్యర్థులు తంత్రాలు
రాష్ట్రవ్యాప్తంగా గ్రామాల్లో ఎన్నికల హడావిడి కనిపిస్తోంది. సర్పంచ్ స్థానాన్ని గెలుచుకునేందుకు అభ్యర్థులు తంత్రాలు, వ్యూహాలు సిద్ధం చేస్తున్నారు. కొన్ని చోట్ల అభ్యర్థులు అభివృద్ధి కోసం వ్యక్తిగత నిధులిచ్చి ఏకగ్రీవానికి కసరత్తు చేస్తున్నారు. పెద్దపల్లి జిల్లా మంథని మండలం పరిధిలో చదువుకున్న యువకులు, యువత ఈసారి పోటీకి ముందుకు వస్తున్నారు. గద్దలపల్లిలో ఇద్దరు నెలల శిశువుతో ఓ యువతి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేస్తుండగా, వెంకటాపూర్‌లో ఓ యువకుడు తన వాగ్దానాలను బాండ్ పేపర్(Bond Paper)లో నమోదు చేసి ప్రతి ఇంటికీ చేరుస్తూ ప్రజల మన్ననలు పొందుతున్నాడు.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: