తన తల్లికి సాయం అందించలేదనే కారణాలతో ఓ వ్యక్తి తన భార్యకు విడాకులు ఇవ్వాలని కోరడం తెలంగాణ (TG) హైకోర్టులో చర్చనీయాంశంగా మారింది. వివరాల్లోకి వెళితే… హైదరాబాద్‌లోని ఎల్‌బీనగర్‌కు చెందిన ఓ వ్యక్తి తన భార్య ఇంటి పనులు, వంట చేయకుండా, తన తల్లికి సాయపడకుండా మానసికంగా హింసిస్తోందని ఆరోపిస్తూ విడాకుల కోసం కోర్టును ఆశ్రయించాడు. కింది కోర్టులో పిటిషన్ తిరస్కరణకు గురవడంతో హైకోర్టులో అప్పీలు దాఖలు చేశాడు.ఈ పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం, దంపతులిద్దరి పనివేళలను పరిశీలించింది.
Read Also: AP: బస్సు ప్రైవేట్ ఆపరేటర్లకు ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ హెచ్చరిక
ఇంటి పనుల విషయంలో ఆరోపణలు చేయడం సహేతుకం కాదు
భర్త మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 10 గంటల వరకు, భార్య ఉదయం 9 నుంచి సాయంత్రం 6 గంటల వరకు సాఫ్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నట్లు గుర్తించింది. ఇద్దరూ ఉద్యోగాలు చేస్తున్నప్పుడు, ఇంటి పనుల విషయంలో ఆరోపణలు చేయడం సహేతుకం కాదని అభిప్రాయపడింది. అంతేకాకుండా గర్భస్రావం తర్వాత కోలుకోవడానికి భార్య

పుట్టింటికి వెళ్లడాన్ని క్రూరత్వంగా భావించలేమని స్పష్టం చేసింది. భర్త ఆరోపణల్లో వైవాహిక బంధాన్ని రద్దు చేసేంత తీవ్రమైన కారణాలు లేవని తేల్చిచెప్పిన హైకోర్టు, అతని అప్పీలును కొట్టివేసింది. ఆధునిక కాలంలో బాధ్యతలను పాతకాలపు ధోరణులతో కాకుండా పరస్పర అవగాహనతో పంచుకోవాలని హితవు పలికింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: