తెలంగాణ రాష్ట్రంలోని ఉద్యోగులు, విద్యార్థులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసే 2026 సంవత్సరానికి సంబంధించిన సెలవుల (TG Holidays List) వివరాలను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. ప్రభుత్వ ఉద్యోగులు, పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణను దృష్టిలో ఉంచుకుని ఈ సెలవుల జాబితాను ప్రభుత్వం ఖరారు చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఆదేశాల మేరకు.. సాధారణ పరిపాలన విభాగం ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Read Also: Global Summit 2025: తొలి రోజు రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు
సెలవులు ఇవే..
సాధారణ, ఆప్షనల్ హాలీడే లిస్ట్‌ను (TG Holidays List) రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది. 2026లో మొత్తం 27 సాధారణ సెలవులు, 26 ఆప్షనల్ సెలవులను ఖరారు చేసింది. జవవరి 14వ తేదీన భోగి, 15న సంక్రాంతి సెలవులు ప్రకటించగా.. జనవరి 26న గణతంత్ర దినోత్సవం సెలవు కేటాయించింది. ఇక ఫిబ్రవరి విషయానికొస్తే.. 15వ తేదీన మహాశివరాత్రి, మార్చి 3వ తేదీన హోలీ, 19న ఉగాది, 21న రంజాన్, 22న రంజాన్ తర్వాతి రోజు, 27న శ్రీరామనవమి సెలవులు ప్రకటించింది.

ఏప్రిల్‌లో 3న గుడ్ ఫ్రైడే, 5న బాబు జగ్జీవన్ రామ్ జయంతి, 14న అంబేద్కర్ జయంతి సెలవులు కేటాయించింది. ఇక మేలో 27న బక్రీద్, ఆగస్టు 10న బోనాలు, సెప్టెంబర్ 14న వినాయకచవితి, అక్టోబర్ 18న సద్దుల బతుకమ్మ, అక్టోబర్ 20వ తేదీన విజయదశమి సెలవులు ఇచ్చింది..ఇక నవంబర్ 8న దీపావళి, 24న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 25న క్రిస్మస్ హాలీడే ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: