हिन्दी | Epaper
ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్ ముషీరాబాద్ స్క్రాప్ గోదాంలోభారీ అగ్ని ప్రమాదం మీర్జాగూడ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు విద్యార్థులు మృతి కొత్తగా యూరియా కార్డు డాక్టర్ లావణ్య ఆత్మహత్య కేసులో బిగ్ ట్విస్ట్ 15 లక్షల మందికి ఇందిరమ్మ చీరల పంపిణీ రిపబ్లిక్ డే పరేడ్‌లో ‘ఒగ్గుడోలు’ ప్రదర్శన మహబూబ్‌నగర్‌లో భూకంపం..జనం భయంతో బయటకు విషంతో పిల్లలను చంపేయండి..వార్డెన్ హుకుం త్వరలో మున్సిపల్‌ ఎన్నికలు కొత్త వాహనాలపై రోడ్డు భద్రతా సెస్సు: పొన్నం ప్రభాకర్

TG High Court: రామంతాపూర్ ఘటనకు అందరూ బాధ్యులే: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

Sharanya
TG High Court: రామంతాపూర్ ఘటనకు అందరూ బాధ్యులే: తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు

హైదరాబాద్: రామంతాపూర్లోని గోఖలేనగర్ లో శ్రీకృష్ణాజన్మాష్టమి వేడుక (Krishna Janmashtami) ల్లో భాగంగా నిర్వహించిన ఊరేగింపు రథానికి కేబుల్ వైరు తగిలి విద్యుదాఘాతంతో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఐదుగురి ప్రాణాలు పోవడానికి విద్యుత్ స్తంబాలపై అమర్చిన కేబుల్ వైర్లు కారణమని, వెంటనే వైర్లను తొలగించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు.

TG High Court
TG High Court

ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరు: జస్టిస్ నగేష్

రంగంలోకి దిగిన విద్యుత్ సిబ్బంది నగరంలోని అన్ని ప్రాంతాల్లో కేబుల్ వైర్ల తొలగింపును చేపట్టారు. ఈ క్రమంలో కేబుళ్ల తొలగింపు అంశంపై భారతీ ఎయిర్టెల్ టెలికామ్ సంస్థ హైకోర్టులో అత్యవసర పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్పై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ నగేష్ భీమపాక (Justice Nagesh Bhimapaka).. కేబుళ్ల పునరుద్ధరణ సమస్య కాదని, ప్రజల ప్రాణాలకు బాధ్యులెవరని ప్రశ్నించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, జీహెచ్ఎంసీ, సర్వీస్ ప్రొవైడర్లు ఎవరికి వారు చేతులు దులిపేసుకుంటే ఎలా? ఈ దుర్ఘటనకు అందరూ బాధ్యులే. మనుషులంటే కాస్త దయ చూపాలని హైకోర్టు (TG High Court) వ్యాఖ్యానించింది. అయితే విద్యుత్ స్తంభాలను వినియోగించు కుంటున్నందుకు డబ్బులు చెల్లిస్తున్నామని పిటిషనర్ న్యాయవాది కోర్టుకు తెలిపారు. కానీ, ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా కేటుల్ వైర్లను కట్ చేస్తున్నారని, ఇంటర్నెట్ అంతరాయంతో పలుచోట్ల సేవలు నిలిచిపోయాయని చెప్పారు. ప్రజల ప్రాణాలే పోతుంటే ఇంటర్నెట్ సేవలు ఎందుకని టీజీఎస్పీడీసీఎల్ తరపు న్యాయవాది అన్నారు. విద్యుత్ స్తంభాలకు పరిమితికి మించి కేబుళ్లు ఉన్నాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ క్రమంలో విద్యుత్ స్తంభాలపై ఉన్న కేబుళ్ల తొలగింపు అంశంపై టీజీఎస్పీడీసీఎల్, జీహెచ్ఎంసీకి హైకోర్టు (TG High Court) నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది. అప్పటివరకు కేబుల్ వైర్లను తొలగించవద్దని ఆదేశించింది.

Read hindi news: hindi.vaartha.com

Read also:

https://vaartha.com/action-will-be-taken-if-narcotics-are-sold-without-a-prescription/telangana/533478/

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870