మద్యానికి బానిసలైన కుటుంబాలు ఎన్నో నేడు విచ్ఛిన్నమవుతున్నాయి. కుటుంబ అవసరాలకు డబ్బులు ఇవ్వక, పిల్లల చదువులను పట్టించుకోక ఆర్థికంగా సామాజికంగా, నైతికంగా పతనమవుతున్న వారెందరో. మద్యం మానేసేవారి కంటే మద్యానికి బానిసలుగా మారుతున్న వారిసంఖ్యే పెరిగిపోతున్నది. మద్యం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని తెలిసినా, ఈ వ్యసనం నుంచి బయట పడలేకపోతున్నారు.
Read Also: TG: తెలంగాణలో కొత్త నేషనల్ హైవేలు..
మద్యంతో ఎంతోమంది మరణిస్తున్నారు. ఎన్నో కుటుంబాలు పెద్దదిక్కు లేకుండా ఉన్నాయి. మద్యానికి బానిసలైన వారి కుటుంబాలు ఆర్థికంగా ఛిన్నాభిన్నంగా మారుతున్నాయి. అంతేకాదు మద్యం (alcohol) రాష్ట్రాల్లో ఏరులా ప్రవహిస్తున్నది. మద్యం దుకాణాల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఇదేవిషయంపై తెలంగాణ హైకోర్టు తీవ్ర విచారం వ్యక్తం చేసింది.

మద్యం దుకాణా నియంత్రణ
వివరణ ఇవ్వాలని కోర్టు ఆదేశం హైదరాబాద్ (Hyderabad)-నాగారం మున్సిపాలిటీ పరిధిలోని శ్రీసత్యనారాయణ కాలనీలో నివాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై స్థానికులు హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు విచారిస్తూ, మద్యం దుకాణా నియంత్రణ పై తమకు పూర్తి అధికారాలు లేనప్పటికీ, విధానపరమైన నిర్ణయంత అతీసుకునేవారకు ఆదేశాలు జారీ చేస్తామని ధర్మాసనం పేర్కొంది. కనీసం రహదారిపైకి కనిపించకుండా మద్యం దుకాణాలను ఏర్పాటు చేయాలని, మద్యం దుకాణాల సంఖ్య ఇలాగే పెరిగితే రాష్ట్రానికి కొత్తపేరు పెట్టాల్సి
ఉంటుందని హైకోర్టు ((TG High Court) ) న్యాయమూర్తి విజయ్ సేన్ రెడ్డి వ్యాఖ్యానించారు. నాగారం మున్సిపాలిటీలో ని వాసాల మధ్య మద్యం దుకాణం ఏర్పాటు చేయడంపై వివరణ ఇవ్వాలని మున్సిపల్, ఎక్సైజ్ అధికారులకు, షాపు యజమానులకు నోటీసులు జారీ చేసింది తెలంగాణ హైకోర్టు.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: