హైదరాబాద్ :రిజర్వేషన్ల కేసులో నాలుగు వారాలు ఎన్నికలు వాయిదా వేస్తూ కోర్టు(TG High Court) స్టే ఇవ్వడం అన్యాయమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్య సభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య(R. Krishnaiah) అన్నారు. ఇది ‘బీసీల నోటి కాడ అన్నం ముద్దను లాక్కోవడమే’ అన్నారు.
Read also: DCC Presidents Selection: రేపు ఏఐసిసి పరిశీలకుల రాక

ఎన్నికల నోటిఫికేషన్ వేసిన తర్వాత రాజ్యాంగ విరుద్ధంగా సుప్రీంకోర్టు(Supreme Court) తీర్పులకు వ్యతిరేకంగా నాలుగు వారాలు ఎన్నిక వాయిదా వేయడం పట్ల ఆర్. కృష్ణయ్య ఆధ్వర్యంలో 14 బీసీ సంఘాలు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశాయి. కోర్టు స్టే ఇచ్చిన తర్వాత బీసీ సంఘాల ప్రతినిధులతో కలిసి ఆర్ కృష్ణయ్య హైకోర్టు(TG High Court) వద్ద మీడియాతో మాట్లాడుతూ కోర్టు మధ్యంతర ఉత్తర్వులను తీవ్రస్థాయిలో ఖండించారు.
‘గురువారం జడ్పిటీసి, ఎంపిటీసీల స్థానాలపై వేలాదిమంది నామినేషన్లు దాఖలు చేశారు. ఇటువంటి పరిస్థితుల్లో కోర్టు ఎలా చేయిస్తాది’ అన్నారు. కేసు నాలుగు రోజులుగా కోర్టులో నడుస్తుంది. ఇస్తే మొదటి రోజే ఇవ్వాలి. కానీ రెండుసార్లు స్టే ఇవ్వబోమని కోర్టు ఇవ్వడానికి నిరాకరించింది. చాలా వాదాలను విన్నాక ఇలా స్టే ఇవ్వడం బాధాకరం.
30 బీసీ సంఘాలు ఇంప్లీడ్ కేసులు వేశారు. పిటిషనర్ల వాదన కూడా వినకుండా స్టే ఎలా ఇస్తారు’ అని ప్రశ్నించారు. ఇది చాలా అన్యాయం అన్నారు. బీసీలను అవమానపరిచారని దీనికి భారీ మూల్యం చెల్లిస్తారని పిలుపునిచ్చారు. అన్ని రాజకీయ పార్టీలు బీసీలకు మద్దతుగా కలిసి రావాలని
పిలుపునిచ్చారు.
ఉన్నత న్యాయస్థానాలు బీసీలకు వ్యతిరేకంగా తీర్పులు వరుసగా ఇస్తున్నందున దీనికి ప్రధానంగా జడ్జీలలో బీసీ ఎస్సీ ఎస్టీలు లేకపోవడమే ప్రధాన కారణం హైకోర్టు సుప్రీంకోర్టు జడ్జీలా నియామకాల్లో ఈ వర్గాలకు రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. ఈ సమావేశంలో బిసి సంఘాల ప్రతినిధులు గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, నీల వెంకటేష్, అనంతుల రామమూర్తి గౌడ్, అల్లంపల్లి రామకోటి, టీ. రాజకుమార్, రాజు నేత, చెరుకు మణికంఠ, లింగయ్య యాదవ్, పగిలిన సతీష్, రాందేవ్ మోడీ, ఆంజనేయులు, రామ నర్సింహాగౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read Also: