ఆర్టీఐ చట్టం కింద సమాచారం ఇవ్వలేదంటూ దాఖలైన పిటిషన్‌పై ఇద్దరు ఐఏఎస్‌లకు తెలంగాణ హైకోర్టు (TG High Court) నోటీసులు జారీ చేసింది.. కోర్టు ఆదేశాలు ఉన్నపటికి RTI చట్టం కింద సమాచారం ఎందుకు అందజేయలేదని కోర్టు వీరికి నోటీసులు ఇచ్చింది. వడ్డం శ్యామ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన న్యాయమూర్తి భీమపాక నగేశ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు ఇచ్చింది.
Read Also: Akhanda-2: అఖండ-2పై టీజీ హైకోర్టులో పిటిషన్
పిటిషనర్ తాను అడిగిన ఆర్టీఐ సమాచారాన్ని అధికారులు ఇవ్వలేదని.. ఈ విషయమై హైకోర్టు (TG High Court) గతంలో ఆదేశాలు ఇచ్చినా అవి అమలు కాలేదని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై తీవ్రంగా హైకోర్టు తీవ్రంగా స్పందించింది.ఈ పిటిషన్ విచారిస్తూ, కోర్టు ధిక్కరణ కింద వారిపై చర్యలు ఎందుకు తీసుకోవద్దో తెలపాలని ఐఏఎస్ అధికారులపై హైకోర్టు న్యాయమూర్తి నగేష్ భీమపాక ఆగ్రహం వ్యక్తం చేశారు.

జనవరి 26కు వాయిదా
కోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేదో వివరిస్తూ జనవరి 26వ తేదీ లోపు కౌంటర్ దాఖలు చేయాలని, లేదంటే వారి అఫిడవిట్లు స్వీకరించమని, రూ.10,000 జరిమానా కూడా విధించాల్సి ఉంటుందని హైకోర్టు హెచ్చరించింది. కేసు విచారణను జనవరి 26కు వాయిదా వేసిన ధర్మాసనం..ఆ తేదీ లోపు తప్పనిసరిగా అధికారులు తమ కౌంటర్‌ను దాఖలు చేయాలని.. లేదంటే వారి అఫిడవిట్లను తామే స్వీకరిస్తామని ఆదేశించింది.
సామాన్య ప్రజలు తమ హక్కుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు.. అధికారులు కోర్టు ఆదేశాలను పాటించకపోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో విమర్శలకు తావిస్తుంది. ఈ ఆదేశాలు అధికారులలో జవాబుదారీతనం, ఆర్టీఐ చట్టం అమలు పట్ల మరింత చిత్తశుద్ధిని పెంచుతాయని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com
Read Also: