సంగారెడ్డి(TG) జిల్లా సిగాచి ఫార్మా కంపెనీ ప్రమాద బాధితులకు పరిహారం చెల్లింపులో జరుగుతున్న జాప్యంపై తెలంగాణ హైకోర్టు మరోసారి తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. పరిహారం పంపిణీలో స్పష్టత లేకపోవడం, ఆలస్యం కొనసాగుతుండటంపై ధర్మాసనం ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుబట్టింది.
Read Also:TG: ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలపై వివరణ ఇవ్వాలంటూ ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు

పేలుడు ఘటన నేపథ్యం
గత ఏడాది సంగారెడ్డి జిల్లా(TG) పాశమైలారం ప్రాంతంలోని సిగాచి పరిశ్రమలో జరిగిన భారీ పేలుడు ఘటనలో 56 మంది ప్రాణాలు కోల్పోగా, 8 మంది ఆచూకీ లభ్యం కాలేదు. ఈ ప్రమాదంలో మరో 28 మంది తీవ్రంగా గాయపడ్డారు. బాధితులకు తగిన పరిహారం చెల్లించాలని, ఘటనపై సిట్ దర్యాప్తు చేపట్టాలని కోరుతూ బాబురావు అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన చీఫ్ జస్టిస్ అపరేశ్ కుమార్ సింగ్ నేతృత్వంలోని ధర్మాసనం,
“పరిహారం ఎంత ప్రకటించారు? ఇప్పటివరకు ఎంత చెల్లించారు? అసలు ఎప్పుడు ఇస్తారు?” అంటూ ప్రభుత్వాన్ని నిలదీసింది.
పూర్తి నివేదిక సమర్పించాలని ఆదేశం
పరిహారం పంపిణీకి సంబంధించిన పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని కంపెనీతో పాటు రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. అదనంగా, ఈ కేసులో ఈపీఎఫ్ హైదరాబాద్ రీజినల్ కమిషనర్, ఈఎస్ఐ డైరెక్టర్, రాష్ట్ర ఔషధ నియంత్రణ మండలిలను సుమోటోగా ప్రతివాదులుగా చేర్చింది. కంపెనీ ప్రకటించిన పరిహారం మరియు చట్టప్రకారం బాధితులకు అందాల్సిన ప్రయోజనాల వివరాలను సమర్పించాలని వారికి నోటీసులు జారీ చేసింది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: