తెలంగాణ పబ్లిక్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్–3 పరీక్షల ఫలితాల ప్రకారం ప్రాథమికంగా ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కార్యక్రమం రేపటి నుంచి ప్రారంభం కానుంది. సర్వీస్ కమిషన్ (TGPSC) ఇటీవల ప్రకటించిన ప్రకటన ప్రకారం, ఈ సర్టిఫికేట్ పరిశీలన నవంబర్ 9 నుంచి నవంబర్ 26 వరకు కొనసాగనుంది. మొత్తం 1,388 పోస్టులకు ఎంపికైన అభ్యర్థులు ఈ ప్రక్రియలో పాల్గొనాల్సి ఉంటుంది.
Read Also: Bandi Sanjay: బండి సంజయ్ వివాదాస్పద వ్యాఖ్యలతో రాజకీయ తుఫాన్

ప్రతిరోజూ రెండు సెషన్‌లుగా జరుగుతుంది
పరిశీలన కార్యక్రమం నాంపల్లి తెలుగు విశ్వవిద్యాలయం (Telugu University) లో ప్రతిరోజూ రెండు సెషన్‌లుగా జరుగుతుంది. మొదటి సెషన్ ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు, రెండవ సెషన్ మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు కొనసాగుతుంది.
ఎంపికైన అభ్యర్థులు తమ షెడ్యూల్ ప్రకారం సమయానికి హాజరుకావాలని కమిషన్ సూచించింది.విద్యార్హత సర్టిఫికెట్లు, హాల్‌టికెట్, ఆధార్/ఏదైనా ప్రభుత్వ ఐడీ, అప్లికేషన్ ఫామ్ తదితర పత్రాలను తీసుకెళ్లాలి. పూర్తి వివరాలకు https://www.tgpsc.gov.in/ సంప్రదించవచ్చు.
Read hindi news: hindi.vaartha.com
Epaper : epaper.vaartha.com/
Read Also: