గ్రూప్-1 ర్యాంకర్ల తల్లిదండ్రుల ఆవేదన
హైదరాబాద్ : తమ పిల్లల భవిష్యత్తుతో రాజకీయాలు వద్దని గ్రూప్1 ర్యాంకర్ల తల్లిదండ్రులు కోరారు. రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నారని కొందరు ఆరోపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈనెల 9న గ్రూప్1 మెయిన్స్ ఫలితాల (Group 1 Mains Results) ను రద్దు చేస్తూ హైకోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. గ్రూప్1 పరీక్షల నిర్వహణ, మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని వాటిని రద్దు చేయాలని కోరుతూ కొందరు, వాటిని రద్దు చేయరాదంటూ మరికొందరు దాఖలు చేసిన 12 పిటిషన్లపై విచారించిన హైకోర్టు… 222 పేజీల తీర్పును వెలువరించింది.
ఈ నేపథ్యంలో మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో గ్రూప్1 ర్యాంకర్లు, వారి తల్లిదండ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా అసత్య ఆరోపణలతో మనోవేదనకు గురిచేస్తున్నారని పలువురు విద్యార్థులు, వారి తల్లి దండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తూ కన్నీళ్లు పెట్టుకున్నారు. అప్పులు చేసి, ఓ పూట తిని.. మరో పూట తినక రెక్కలు ముక్కలయ్యేలా మా పిల్లలను కష్టపడి చదివించామని ఎన్నో త్యాగాలు వేసి చదివిస్తే రూ.3 కోట్లు ఇచ్చి ఉద్యోగాలు కొనుక్కున్నట్లు నిందలు వేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పొద్దున్న పాల ప్యాకేట్లకే పాకులాడే కుటుంబాలకు 3కోట్లు ఎక్కడి నుంచి వస్తాయి..?మాకు అంత స్థోమత లేదు.. మీ రాజకీయాల కోసం మా పిల్లల భవిష్యత్తును నాశనం చేయొద్దు అని అన్ని పార్టీల నేతలు సహకరించి తమ పిల్లలకు ఉద్యోగాలు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. పోస్టులు కొనుక్కున్నామన్న ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధమని ఇలాంటి ఆరోపణలతో తమబిడ్డలు మనోవేదనకు గురవుతున్నారన్నారు. లేనిపోని దుష్ప్రచారాలు వ్యాప్తి చేయకుండా వాస్తవాలను తెలియపరిచి తమపిల్లలకు న్యాయం చేయాలని ప్రభుత్వానికి, హైకోర్టు
(TG HighCourt) కు తల్లిదండ్రులు కోరారు.
భర్తను కోల్పోయా…కొడుకును పోగొట్టుకుంటానేమోనని భయం వేస్తుంది: ఓతల్లి ఆవేదన
భర్తను కోల్పోయి రూ.11 వేలకు చిన్న ఉద్యోగం చేస్తూ తన కొడుకుని చదివించుకున్న ఓతల్లి ఆవేదన అందరిని కరిగిపోయేలా చేసింది. ఆమె తన గోడును పంచుకుంది.మా బాబు చాలా కష్టపడి చదివాడు.. నేను భర్తను కోల్పోయాను.. తండ్రిని కోల్పోయినా నా కొడుకు కుంగిపోలేదు.. కష్టపడి చదివించాను..
30 వేల రూపాయలు కూడా ఏనాడు కళ్ళ తో చూసుకున్న పరిస్థితి లేదు… నాకు భయంగా ఉంది.. నా కొడుకును కూడా కోల్పోతాను ఏమో అని.. గుండె జల్లుమంటోంది.. ఒక్క 10 రూపాయల బిళ్ళ పెట్టి ఉద్యోగం కొన్నట్టు నిరూపించినా మాకు ఈ ఉద్యోగం వద్దు.. ఎలాంటి శిక్ష ఐనా వేయండి.. ఒక ప్రభుత్వ స్కూల్ లో స్వీపర్ గా పనిచేస్తూ.. నా కొడుకును చదివించాను..ఇంటి నిండా పుస్తకాలు ఉన్నాయి తప్ప..
ఎంత వెతికినా 10 నోట్లు కూడా కనిపించవు.. కష్టపడి చదివిన స్టూడెంట్స్ ను ఏం చేద్దామని తప్పుడు కామెంట్స్ చేస్తున్నారు.. దేవుడా.. ర్యాంక్ తెచ్చుకుంటే ఇన్ని అవమానాలా..! అనుకునే పరిస్థితి. 3 కోట్లు ఎవరు తీసుకున్నారు…. ఎక్కడ తీసుకున్నారు.. ఎలా తీసుకున్నారు.. సమాధానం చెప్పాలి. న్యాయం జరుగుతుంది అనే నమ్మకం ఉంది.. మీ రాజకీయాలు..
మీరు మీరు చూసుకోండి. మీ స్వార్థానికి మా పిల్లలను బలి చేయకండి.. మా పిల్లలను పావులుగా
వాడుకోకండి..” అని ఆతల్లి వేదికపై కన్నీరు మున్నీరుగా విలపించింది. నాకొడుకు యుపిఎఎస్పీకి ప్రెవర్ అయ్యాడు.. రాత్రిభవళ్లు కష్టపడి గ్రూప్ 1 ఉద్యోగం సాధించాడు.నా కొడుకు యూపీఎస్సీకి ప్రిపేర్ అయ్యాడు. అనుకోని కారణాల వల్ల పరీక్ష రాయలేక పోయాడు. గ్రూప్ 1 నోటిఫికేషన్ (Group 1 Notification) వచ్చినపుడు.. గ్రూప్ 1 రాయమని మేము చెప్పాము.
నేను యూపీఎస్పీకే ప్రిపేర్ అవుతానన్నాడు. మా మాట మన్నించి కష్టపడి రాశాడు. అనుకున్న ఫలితం సాధించాడు. ఈ ఫలితం ఊరికే రాలేదు. నాలుగు గోడల మధ్య కూర్చొని రాత్రింబవళ్లు ఎంతో కష్టపడి చదివాడు. ఈ జర్నీలో వాడి నాన్నని కూడా కోల్పోయాడు. నాన్న కలను ఎలాగైనా తీరుస్తాను మమ్మీ అని చెప్పి కష్టపడి ర్యాంకు సాధించాడు. అప్పుడు మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. ఇప్పుడు వాడి భవిష్యత్తు అందకారంలో పడింది.
ఇది మా కుటుంబ సమస్యే కాదు. ఒక్కసారి ఆలోచించండి. నా కొడుకు ఎప్పుడూ ఏ లగ్జరీ లైఫ్ కోరుకోలేడు. బుక్స్ మధ్యలోనే ఉండి ఎన్నో త్యాగాలు చేశాడు. అన్ని చేసి ఇప్పుడు దోషిలాగా నిలబడ్డాడు. ఇది ఎంతవరకు కరెక్ట్. దీనికి ఎవరు జవాబు చెబుతారు. రూ.3 కోట్లు అంటున్నారు. ఛీటింగ్ అంటున్నారు. ఆది నిరూపించండి ఫస్ట్. వాళ్లు కష్టపడ్డారు. ర్యాంక్ సాధించారని మేము ప్రూప్ చేస్తాం. వాళ్లు ప్రిపేర్ అయిన ప్రతి మెటీరియల్ మా దగ్గర ఉంది. కష్టపడిన పిల్లలకి ఉద్యోగం ఇవ్వండి.” అని ఆమె కన్నీరు పెట్టుకున్నారు.

యవ్వనం తాకట్టుపెట్టి కాబోయే భార్యను చదివిస్తున్నా.. ఓసాప్ట్వేర్ ఉద్యోగి ఆవేదన
సాఫ్ట్వేర్ ఉద్యోగి తనకు కాబోయే భార్య గురించి న్యాయపోరాటం చేసేందుకు మీడియా ముందుకు వచ్చాడు.. సోమాజీగూడ్ (Somajigooda) ప్రెస్ క్లబ్లో ఆ యువకుడు మాట్లాడాడు. తనకు, గ్రూప్ 1లో ర్యాంకు సాధించిన అమ్మాయికీ పెళ్లి మాట ముచ్చట అయ్యిందని తెలిపాడు.. ఉద్యోగం వచ్చిన తర్వాత నే పెళ్లి చేసుకోవాలి అనుకున్నామని.. ఇప్పటికీ ఎందురు చూస్తున్నామన్నాడు. నాతో పెళ్లి సంబంధం సెట్ అయిన అమ్మాయి ఇప్పుడు గ్రూప్ 1 ర్యాంక్ తెచ్చుకుంది.. తను చిన్నప్పటి నుంచి చదువుల్లో నెంబర్ 1 అని ఆధారాలు సైతం మీడియాకు చూయించాడు. “నేను ఆమెకు కోచింగ్ ఇప్పించాను.
ఆమె బాధ్యతలు తీసుకున్నాను. ఇప్పటికీ మేము వెయిట్ చేస్తున్నాం. తాను పదిలో టాపర్, ఇంటర్లో టాపర్, డిగ్రీలో కోటీ ఉమెన్స్ కాలేజీ (Koti Women’s College) లో గోల్డ్ మెడల్ తీసుకుంది. ఓయూలో పీజీ చేసింది. ఫిజిక్స్ లో గోల్డ్ మెడల్ తీసుకుంది. ఇవన్నీ ఫ్రూప్స్, ఇప్పటి వరకు మేము బటయకు రాలేదు. నిజం గడపదాటేలోపు అబద్ధం దేశమంతా చుట్టివచ్చింది. అందుకే ఇవన్నీ చెప్పుకొని చూయించాల్సి వస్తుంది. ఈ పరీక్ష అయిపోయి ఏడాది అవుతోంది.
అప్పటి నుంచి ఎదురుచూస్తున్నాం ఎందుకంటే న్యాయవ్యవస్థపై నమ్మకం ఉంది కాబట్టి.. కానీ ఇప్పుడు రాజకీయ నాయకులు ఎంట్రీ ఇచ్చారు. వాళ్ల స్వార్థం కోసం మమ్మల్ని వాడుకుంటున్నారు. యవ్వనం తాకట్టు పెట్టి మరీ చదివిస్తున్నాం. నేను ఒక సాఫ్ట్వేర్ ఉద్యోగిని. ఎప్పుడు లేఆఫ్స్ అవుతాయో తెలియదు. మేము ఎలాగో వెనకబడిన తరగతి నుంచి వచ్చాం.
కానీ మా ముందుతరం ఇలా కావొద్దని యవ్వనం తాకట్టు పెట్టాం.. ఇప్పటికీ మ్యారెజ్ చేసుకోలేదు. వయసు పెరుగుతున్న కొద్దీ పిల్లలు పుట్టడం ప్రాబ్లమ్ అవుతుందని మాకు తెలుసు. తెలిసినా కూడా మా ముందుతరాల కోసం ఇది చేస్తున్నాం. మేము జన్యూన్ క్యాండిడెట్స్.. మా ముఖం చూస్తే మీకే అర్ధం అయి ఉంటుంది. మీడియా,కూడా మాకు సపోర్టు చేయాలి.” అని ఆవేదన వ్యక్తం చేశాడు.
నాకూతురు 10లక్షల ప్యాకేజీ వదులుకుంది: మాజీ జవాన్
ఓ మాజీ జవాన్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మూడు కోట్లు ఉంటే చక్కగా నా కూతురికి పెళ్లి చేసేవాడిని కదా.. అంటూ వాపోయారు. ఈ దేశానికి సేవ చేసిన నన్ను ఆదర్శంగా తీసుకుని.. రాష్ట్రానికి సేవ చేస్తానని తన కుమార్తె ముందుకు వచ్చిందని తెలిపారు. అందుకోసం రూ.10 లక్షల ప్యాకేజీని వదులుకుని రోజుకు 16 గంటలు చదివిందని వెల్లడించారు.”నేను ఒక మాజీ సైనికుడిని. దేశం కోసం సేవ చేశాను. నా పాప ఎన్ఐటీ ద్వారా బీటెక్ చేసి..2020లో పది లక్షల రూపాల ప్యాకేజీ ఉన్న ఉద్యోగానికి రాజీనామా చేసింది.
అప్పటి నుంచి రోజూ 16 గంటలు చదివింది. మూడో సారి మెయిన్స్ (mains) రాసింది. ర్యాంకు సాధించుకుంది. రేపు ఉద్యోగం వస్తది అనుకునేలోపే కోర్టులో కేసు పడింది. ఆమెకు అపాయింట్మెంట్ రాలేదు. కోర్టులో తీర్పు కూడా మాకు ప్రతికూలంగా వచ్చింది. ఆమెకు మ్యారేజీ చెయాల్సి ఉంది. అది కూడా ఆగిపోయింది.
మేము ఎంతో ఇబ్బంది పడుతున్నాం. తెలంగాణ వస్తే మన జాబులు మనకే అన్నారు. 12 ఏళ్ల తరువాత సాకారం అయితది అనుకుంటే దానికి అడ్డుపుల్ల వేశారు.. సెలక్ట్ అయిన వాళ్లందరూ చాలా నైపుణ్యం గల పిల్లలు. అటువంటి పిల్లలను డబ్బులిచ్చి జాబులు కొన్నారని చెప్పి.. నానా విధాలుగా వాళ్లను ఇబ్బందులు పెడుతున్నారు. తెలంగాణ సమాజం దీన్ని గుర్తించాలి. దీనికి సరైన గుణపాఠం చెప్పాలి.” అని మాజీ జవాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
Read hindi news: hindi.vaartha.com
Read Also: