తెలంగాణ ప్రభుత్వం( TG Govt) చిన్నారులలో పోషకాహార లోపాన్ని తగ్గించేందుకు కొత్త, సృజనాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ములుగు జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా, 3 నుండి 6 ఏళ్ల లోపు పిల్లలకు ప్రతి రోజూ సాయంత్రం అంగన్‌వాడీ కేంద్రాల్లో గోరువెచ్చని పాలు అందించే కార్యక్రమం ప్రారంభించనుంది.ఈ పథకం మొదటి దశలో ములుగు జిల్లాలోని నాలుగు ICDS ప్రాజెక్టుల పరిధిలో ఉన్న 7,918 మంది చిన్నారులు లబ్ధి పొందనున్నారు. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం, ఈ కార్యక్రమం శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సంవత్సరానికి 200 పని దినాల్లో అమలు కానుంది.గ్రామీణ ప్రాంతాల్లో పేద కుటుంబాల తల్లిదండ్రులు ఉదయం పనులకు వెళ్లిపోవడం వల్ల పిల్లలకు సరైన సమయంలో పోషకాహార ఆహారం అందకపోవడం ఒక ప్రధాన సమస్యగా మారింది. ఈ పరిస్థితిలో పిల్లలు వయసుకు తగ్గ బరువు, ఎదుగుదల సాధించలేకపోతున్నారు.
Read Also: Karnataka: బెంగళూరులో రెండో విమానాశ్రయంకు వేగంగా అడుగులు
TG Govt: ఈ సమస్యను పరిష్కరించేందుకు ప్రభుత్వం ఈ పథకాన్ని రూపొందించింది. ప్రణాళిక ప్రకారం, అంగన్‌వాడీ కేంద్రాల్లో రోజూ సాయంత్రం స్నాక్స్‌తో పాటు 100 మిల్లీ లీటర్ల గోరువెచ్చని పాలు అందించనున్నారు. చిన్నారులకు అందించే పాలు విజయ డెయిరీ ద్వారా డబుల్ టోన్డ్ మిల్క్ రూపంలో సరఫరా చేయనున్నారు. ఈ పథకం ములుగు జిల్లాలో రేపటినుంచి అధికారికంగా ప్రారంభం కానుంది.

జిల్లా సంక్షేమ అధికారి తుల రవి మాట్లాడుతూ, “పూర్వ ప్రాథమిక విద్యనభ్యసించే చిన్నారులకు పాలు అందించేందుకు ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. దీనిపై అంగన్‌వాడీ టీచర్లకు ఇప్పటికే సూచనలు అందించాం. గురువారం నుంచి పథకం అమలుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి,” అని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమం ద్వారా చిన్నారులలో పోషకాహార లోపాలను తగ్గించి, ఆరోగ్యకరమైన బాల్యాన్ని అభివృద్ధి చేయడమే లక్ష్యం. ఇది అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా బాలల శారీరక ఎదుగుదల మరియు ఆరోగ్య పరిరక్షణలో కీలకమైన అడుగుగా భావించబడుతోంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: