రాష్ట్ర ప్రభుత్వం(TG Govt Jobs) విడుదల చేసిన తాజా నివేదిక ప్రకారం, గత రెండు సంవత్సరాల్లో తెలంగాణలో 61,379 ఉద్యోగాలను భర్తీ చేసినట్లు వెల్లడించింది. రాబోయే ఆరు నెలల్లో ఇంకా ఒక లక్షకు పైగా ఉద్యోగాలను భర్తీ చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతుందని అందులో పేర్కొంది.
Read Also: AP TET 2025: టెట్ హాల్‌టికెట్లు విడుదల

మునుపటి ప్రభుత్వ కాలంలో నియామకాలపై స్పష్టత లేక నిరుద్యోగులు ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొనగా, ఇప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో తక్షణమే నియామక ప్రక్రియలు, ఉద్యోగ మేళాలు, సమయానికి అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ చేయడం వల్ల యువతలో మరోసారి నమ్మకం పెరిగిందని నివేదిక వెల్లడించింది.
రేవంత్ రెడ్డి ప్రభుత్వం – కీలక నియామకాల విశ్లేషణ
డిసెంబర్ 7తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(TG Govt Jobs) పాలన రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ప్రభుత్వం వివిధ విభాగాల్లో చేపట్టిన నియామకాలపై సమగ్ర నివేదికను విడుదల చేసింది. రాష్ట్రవ్యాప్తంగా 61,379 ఉద్యోగాలను భర్తీ చేయడం ద్వారా దేశవ్యాప్తంగా ప్రత్యేక రికార్డు సృష్టించామని, ఇంకా 8,632 పోస్టులు చివరి దశలో ఉన్నట్లుగా నివేదిక వివరించింది. ఇలా ఇప్పటివరకు మొత్తం 70,011 పోస్టుల నియామకాలు పూర్తి చేసినట్లు తెలియజేసింది. విద్య, వైద్య-ఆరోగ్యం, పోలీస్ శాఖ, ఇంధన సంస్థలు, పరిపాలనా విభాగాలు వంటి కీలక రంగాల్లో నియామకాలను ప్రాధాన్యతతో చేపట్టినట్లు పేర్కొంది.
TGPSC పునర్నిర్మాణం – కీలక సంస్కరణలు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) పునరుద్ధరణను ప్రభుత్వం ప్రధాన సంస్కరణలుగా చేపట్టింది. సంవత్సరాల తరబడి పెండింగ్‌లో ఉన్న పరీక్షలను వేగంగా నిర్వహించడం, వయోపరిమితి సడలింపులు ఇవ్వడం, ఖాళీగా ఉన్న పోస్టులను తక్షణమే భర్తీ చేయడం వంటి చర్యలు కీలక మలుపుగా నివేదికలో పేర్కొంది.
గ్రూప్ పరీక్షలు – వివాదాల నుంచి విజయవంతమైన నిర్వహణ వరకు
గత ప్రభుత్వ హయాంలో పేపర్ లీకేజీల కారణంగా అస్తవ్యస్తమైన గ్రూప్ పరీక్షా వ్యవస్థను పునర్నిర్మించినట్లు నివేదిక తెలిపింది.
- గ్రూప్-1: 562 పోస్టులకు తిరిగి నోటిఫై చేసి, నిర్ణీత షెడ్యూల్‌లో పరీక్షలు పూర్తి చేసి, సెప్టెంబర్ 27న అపాయింట్‌మెంట్ ఆర్డర్లు జారీ.
- గ్రూప్-2: సెప్టెంబర్ 28న ఫలితాలు విడుదల చేసి, 782 మంది అభ్యర్థులకు నియామక ఉత్తర్వులు.
- గ్రూప్-3: 1,365 పోస్టులకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
- గ్రూప్-4: త్వరలోనే 8,143 మందికి నియామక పత్రాలు అందించనున్నారు.
Read hindi news:hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: