తెలంగాణ ప్రభుత్వం అంగన్‌వాడీ (Anganwadi) కేంద్రాలకు కొత్త ఊపిరి పోస్తూ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. ప్రీ-ప్రైమరీలో చదువుతున్న చిన్నారులందరికీ ఇకపై ప్రభుత్వ పాఠశాలల పిల్లల మాదిరిగానే ఉచిత యూనిఫాంలను అందించనుంది. ఈ నిర్ణయం వల్ల చిన్నారుల్లో సమానత్వం, ఆత్మవిశ్వాసం పెరగడంతో పాటు హాజరు కూడా మెరుగుపడే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. అదనంగా, యూనిఫాం తయారీ పనులను మహిళా సంఘాలకు అప్పగించడం ద్వారా స్థానిక మహిళలకు ఉపాధి కల్పన కూడా జరుగుతోంది
Read also: Latest Telugu News : Free : ఉచిత ‘తంత్రం’పై ఆలోచించాలి..

Government’s new scheme for Anganwadi children
పిల్లల విద్యతో పాటు
పిల్లల్ని చిన్న వయసులోనే పాఠశాల వాతావరణానికి అలవాటు చేయడం, ఆర్థిక పరిస్థితి ఎలా ఉన్నా అందరూ ఒకేలా కనిపించేలా చేయడం, అంగన్‌వాడీలను నర్సరీ పాఠశాలల స్థాయికి తీసుకెళ్లడం ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఆకర్షణీయమైన కొత్త దుస్తులు పిల్లలను అంగన్‌వాడీ కేంద్రాలకు రాక ప్రోత్సహిస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఖమ్మం జిల్లాలో మాత్రమే 3–6 సంవత్సరాల మధ్య ఉన్న 19,000 చిన్నారులకు రెండు జతల యూనిఫాంలను పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. బాలురకు చొక్కా–నిక్కరు, బాలికలకు ఫ్రాక్ రూపంలో యూనిఫాంలను రూపొందించారు. గ్రే అండ్ రెడ్ కలయికతో ఉన్న ఈ డ్రెసులు పిల్లలకు మరింత ఆకర్షణీయంగా ఉంటాయని అధికారులు తెలిపారు.
యూనిఫాం కుట్టింపు బాధ్యతను మహిళా శక్తి సంఘాలకు అప్పగించడం ద్వారా మహిళల ఆదాయం పెరగడమే కాక, పథకం అమలు వేగం కూడా మెరుగవుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈ చర్యతో అంగన్‌వాడీ కేంద్రాలు ఇప్పుడు పిల్లల విద్యతో పాటు గ్రామీణ మహిళల ఆర్థికాభివృద్ధికి కూడా కేంద్రాలుగా మారనున్నాయి.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com/
Read Also: