TG: తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ మరోసారి నాగార్జునసాగర్ (Nagarjuna Sagar) నుండి శ్రీశైలం వరకు లాంచీ సేవలను ప్రారంభించింది. కృష్ణానదిపై నడిచే ఈ ప్రత్యేక జలయానం మొత్తం 110 కిలోమీటర్ల పాటు సాగుతుంది. ప్రయాణికులు నల్లమల కొండల సౌందర్యం, నది ఒడ్డున ఉన్న చారిత్రక ప్రదేశాలు, ప్రకృతి అందాలను దగ్గరగా చూడగలరు.
Read also: TG: తెలంగాణలో తొలి సైనిక్ స్కూల్.. 24 న భూమి పూజ చేయనున్న రేవంత్

Good news for tourists.. Launch trip on Krishnamma!
లాంచీ యాత్రలో ఏం చూడొచ్చు
ఈ జలయాత్ర సుమారు ఆరు గంటలు సాగుతుంది. నాగార్జునకొండ, ఏలేశ్వరం, పొగిళ్ల, జెండాపెంట, ఇసుక రేవులు, అలాటం, పావురాల గుట్ట, నక్షత్రాల దీవి, లింగాల గుట్ట వంటి పర్యాటక ప్రాంతాలు మార్గమధ్యంలో కనిపిస్తాయి. నల్లమల అడవుల్లో ఉండే పలు జంతువులు, పక్షులను కూడా అదృష్టముంటే చూసే అవకాశం ఉంటుంది.
భద్రత, సౌకర్యాల వివరాలు
పర్యాటకుల భద్రత కోసం లైఫ్ జాకెట్లు, శిక్షణ పొందిన గజ ఈతగాళ్లు, అగ్నిమాపక పరికరాలు, ప్రథమ చికిత్స కిట్లు సిద్ధంగా ఉంచారు. లాంచీలో శుభ్రమైన మరుగుదొడ్లు, మధ్యాహ్న భోజనం, తాగునీరు, స్నాక్స్ వంటి సౌకర్యాలు కల్పించారు. ప్రయాణికులకు సందర్శన ప్రాంతాల సమాచారం తెలియజేయడానికి అనుభవజ్ఞులైన గైడ్ కూడా ఉంటారు.
టికెట్ ధరలు
ఒకవైపు ప్రయాణం (సాగర్ → శ్రీశైలం)
పెద్దలు: రూ. 2,000
పిల్లలు (5–10 సంవత్సరాలు): రూ. 1,600
రెండు వైపుల ప్రయాణం (సాగర్ → శ్రీశైలం → సాగర్)
పెద్దలు: రూ. 3,250
పిల్లలు (5–10 సంవత్సరాలు): రూ. 2,600
Read hindi news: https://hindi.vaartha.com
Epaper : https://epaper.vaartha.com/
Read also :