తెలంగాణలో పంచాయతీ ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో ఆంక్షలు అమల్లోకి వచ్చినా, ఉద్యోగుల పెండింగ్ బకాయిల విడుదలపై ప్రభుత్వం వేగం పెంచింది. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీల్లో పనిచేస్తున్న మల్టీ పర్పస్ వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. అక్టోబర్ నెలకు సంబంధించిన వారి వేతనాలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉండడంతో, తాజాగా ప్రభుత్వం రూ.46.77 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ఆదేశాలు జారీ చేసింది.
Read also: Sports School: ములుగు జిల్లాలో కొత్త స్పోర్ట్స్ స్కూల్

Good news for those employees.. Rs.46.77 crores released
రాష్ట్రవ్యాప్తంగా 31 జిల్లాల్లో మొత్తం 49,456 మంది ఎంపీడబ్ల్యూలు పనిచేస్తున్నారు. వీరి అక్టోబర్ జీతాలను గ్రామ పంచాయతీల టీఎస్-బీ పాస్ ఖాతాల్లో ఇప్పటికే జమ చేసినట్లు అధికారులు తెలిపారు. అయితే జీతాలు ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్‌లో తమ వివరాలు నమోదు చేసుకున్న ఉద్యోగులకే పంపిణీ చేయాలని సూచించారు. పోర్టల్‌లో నమోదు లేని వాళ్లకు ఎట్టి పరిస్థితుల్లోనూ చెల్లింపులు చేయొద్దని జిల్లా పంచాయతీ అధికారులకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.
పెండింగ్ జీతాలు విడుదల కావడంతో
ఇకపోతే, డిసెంబర్‌లో జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఇప్పటికే మూడు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నట్లు ప్రకటించింది. డిసెంబర్ 11, 14 మరియు 17 తేదీల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ నిర్వహించి, అదే రోజు మధ్యాహ్నం 2 గంటలనుంచి ఓట్ల లెక్కింపు చేపట్టి ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎస్ఈసీ తెలిపింది.
Read hindi news : hindi.vaartha.com
Epaper : epapervaartha.com
Read Also: