हिन्दी | Epaper
బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు బెంగళూరులో గూగుల్ క్యాంపస్ ఢిల్లీలో షాక్ రోజుకు 27 మంది మిస్సింగ్ బంగారం ధరలు మంటలు కుప్పకూలిన వెండి ధరలు నేటి నుంచి భారత్ ట్యాక్సీ సేవలు ‘గోల్డెన్ అవర్’ చికిత్స నిలిచిపోనున్న క్యాబ్, ఆటో సేవలు అమెరికాకు భారత్‌ వార్నింగ్‌ రాయలసీమ వర్సిటీలో గొడవలు గ్రూప్-1 అభ్యర్థులకు హైకోర్టులో ఊరట పట్టాలు తప్పిన రైలు

TG: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిధులు విడుదల

Saritha
TG: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిధులు విడుదల

తెలంగాణలో (TG) కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త ఇచ్చింది. ఎప్పటి నుంచో గ్రామ పంచాయతీలకు రావాల్సిన బకాయిలకు సంబంధించి కీలక ప్రకటన వెలువరించింది. 15వ ఆర్థిక సంఘం నిధులను తాజాగా కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. తొలి విడతలో భాగంగా రూ.259.36 కోట్లను విడుదల చేసింది. గ్రామ పంచాయతీ (Grama Panchayat) ఎన్నికలు ఆలస్యం కావడంతో ఇన్ని రోజులుగా ఈ 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయకుండా కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు విడుదల చేసింది. పంచాయతీల పదవీ కాలం పూర్తి అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించకపోవడంతో నిధుల విడుదలను కేంద్రం నిలిపివేసింది.

Read Also: Telangana Chili Prices: ఈ యేడాది మిర్చి రైతులకు సంతోషం

TG: కొత్తగా ఎన్నికైన సర్పంచ్‌లకు నిధులు విడుదల
Funds released to the newly elected Sarpanches.

నిధులు విడుదల

(TG) పంచాయతీ ఎన్నికలు పూర్తికావడం రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ అధికారులు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు చేయడంతో ఈ నిధులను విడుదల చేసింది. అయితే 15వ ఆర్థిక సంఘం నిధుల కింద కేంద్ర ప్రభుత్వం మొత్తం రూ.3 వేల కోట్ల వరకు తెలంగాణకు ఇవ్వాల్సి ఉండగా మొదటి విడతలో భాగంగా ఈ రూ.259.36 కోట్లను విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వ రూల్స్ ప్రకారం ప్రజల చేత ఎన్నికైన సర్పంచ్‌లు ఉంటేనే ఈ ఆర్థిక సంఘం నిధులను నేరుగా గ్రామ పంచాయతీ అకౌంట్లలోకి ట్రాన్స్‌ఫర్ చేస్తారు. ఈ నిధులను గ్రామాల్లో మౌలిక సదుపాయాలకు వినియోగించాల్సి ఉంటుంది. గ్రామాల్లో మంచినీటి సరఫరా, పారిశుద్ధ్యం, ఇతర అవసరాల కోసం ఖర్చు చేయనున్నారు.

Read hindi news: hindi.vaartha.com

Read Also Epaper : epaper.vaartha.com

Read Also:

గమనిక: ఈ వెబ్ సైట్ లో ప్రచురించబడిన వార్తలు పాఠకుల సమాచార ప్రయోజనాల కోసం ఉద్దేశించి మాత్రమే ఇస్తున్నాం. మావంతుగా యధార్థమైన సమాచారాన్ని ఇచ్చేందుకు కృషి చేస్తాము.

📢 For Advertisement Booking: 98481 12870