(TG) రాష్ట్రంలో ఉన్న సుమారు 5 లక్షల మంది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇప్పటివరకు కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జీతాలను వారి హెచ్వోడీలు, లేదంటే ఏజెన్సీలకే సర్కారు జమచేస్తూ వస్తోంది. అయితే ఆయా ఎజెన్సీలు ఉద్యోగుల జీతాల్లో కోతలు పెట్టడంతోపాటు భారీ అక్రమాలు జరుగుతున్నాయి. దీంతో ఏప్రిల్ నుంచి ప్రభుత్వం ఇక నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోనే జీతాలు(Salaries) జమ చేయనుంది. మధ్య వర్తులు, ప్రైవేట్ ఏజెన్సీల ప్రమేయం లేకుండా అత్యంత పారదర్శకంగా జీతాలు చెల్లించాలని ఆర్థిక శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో లక్షలాది మంది ఉద్యోగుల కష్టార్జితం ఇకపై మధ్యవర్తుల పాలు కాకుండా నేరుగా వారి చేతికే అందే అవకాశం ఉంది.
Read Also: Telangana: సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టు కీలక ఆదేశాలు

కార్మికులకు ఆలస్యా వేతనాల నుంచి విముక్తి
ప్రస్తుతం (TG) ప్రభుత్వ ఉద్యోగులకు ఐఎఫ్ఎంఎస్ (ఇంటిగ్రేటెడ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ సిస్టమ్) విధానంలో జీతాలను సర్కారు చెల్లిస్తోంది. ఇకమీదట కాంట్రాక్ట్ కార్మికులకు అదే విధానాన్ని అమలు చేయనున్నారు. అయితే ప్రస్తుత ఐఎఫ్ఎంఎస్లోనే ప్రత్యేక ఆప్షన్ ఇచ్చి వీరికి శాలరీలు జమ చేయడమా.. లేదంటే వీరి కోసం ప్రత్యేక వెబ్‌పోర్టల్ తయారు చేయడమా? అనే దానిపై ఆర్థిక శాఖ కసరత్తు చేస్తోంది.
ఏజెన్సీల జాప్యం వల్ల నెలల తరబడి వేతనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి కార్మికులది. ఇక మీదట ఉద్యోగులందరికీ ఐఎఫ్ఎంఎస్ పోర్టల్ లేదా ప్రత్యేక పోర్టల్ ద్వారానే చెల్లింపులు చేస్తే దీని నుంచి విముక్తి లభించనుంది. అంతేకాక ప్రతి నెలా వీరికి క్రమం తప్పకుండా జీతాలు అందే అవకాశం కలుగుతుంది. జీతాలు నేరుగా పడటం వల్ల కేవలం నగదు అందడమే కాకుండా, ఉద్యోగుల సామాజిక భద్రతకు కూడా గ్యారెంటీ ఉంటుంది.
Read hindi news: hindi.vaartha.com
Epaper: epaper.vaartha.com
Read Also: